వరల్డ్ కప్ కి ఎంపిక చేయగానే.. తుస్సుమంటున్నారు?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బ్యాట్స్మెన్ లు చెలరేగిపోతున్న తీరు ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేస్తుంది అన్న విషయం తెలిసిందే. అంచనాలకు మించి బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తూ అదరగొడుతున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్లో ప్రతి టీం అటు 200 కు పైగా పరుగులు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.  అయితే బ్యాట్స్మెన్ లు ఇంతటి బ్యాటింగ్ విధ్వంసం సృష్టించడానికి గల కారణం.. ఇక ఒకవైపు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టును గెలిపించడం అయితే.. ఇంకోవైపు ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోవడం అని చెప్పాలి.

 ఐపీఎల్ టి20 ఫార్మాట్లోనే జరుగుతూ ఉండడం.. ఇక టి20 ఫార్మాట్లో బాగా రాణించిన ఆటగాళ్లకు అటు వరల్డ్ కప్ జట్టులో చోటుదొక్కే అవకాశం ఉండడంతో.. ఇక ఎంతో మంది ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ భారీగా పరుగులు చేస్తూ వస్తున్నారు అని చెప్పాలి. అయితే భారత జట్టు సెలక్షన్ విషయంలో కూడా ఇక ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకే మొదటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది అనిఅందరూ అనుకున్నారు. అయితే ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్లకే అటు వరల్డ్ కప్ జట్టులోకి కూడా ఎంపిక చేసారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా టి20 వరల్డ్ కప్ లోకి ఎంపికైన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, శివం దూబే లాంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా,  శివం దూబే, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ లో ఉంటూ భారీగా పరుగులు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వరల్డ్ కప్ జట్టును ప్రకటించారో అప్పుడు నుంచి ఈ ప్లేయర్లందరూ కూడా బ్యాటింగ్లో తుస్సు మంటున్నారు. మొన్నటికి మొన్న రోహిత్ నాలుగు పరుగులు, సూర్య 10, పాండ్య 0 పరుగులతో విఫలం కాగా.  ఇక ఇటీవల చెన్నై,పంజాబ్ మధ్య జరిగిన దూబే డకౌట్, జడేజా 2 పరుగులతో వెను తిరిగాయి. ఇలా వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత ఆటగాళ్ళందరూ విఫలమవుతూ ఉండడం ఆందోళనకరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: