ఎన్టీఆర్ వ్యూహం ... లోకేష్ ని తొక్కేస్తాడని చంద్ర బాబు కలవర పడుతున్నాడా ...!

Prathap Kaluva

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి వంశం లో టీడీపీ పగ్గాలు అందుకోగల సమర్ధత ఉన్న యువ నాయకుడు. అయితే ఈ ఎన్టీఆర్ ను తొక్కేయడానికి ఇప్పటివరకు చంద్ర బాబు , లోకేష్ చేయని ప్రయత్నాలు ఒకటి రెండు కాదు. అయితే ఎన్టీఆర్ ఎగిసిన కెరటం మాదిరిగా మూవీస్ లో టాప్ హీరోగా ఎదిగిపోతున్నాడు. అయితే  మామ గేమ్స్‌ అన్నీ ఈ పాటికే తారక్‌కు కూడా అర్థమై ఉండాలి. నందమూరి కుటుంబంలో కాస్త గెలివైన(చురుకైన) వాడిగా కనిపిస్తున్నాడు ఈ హీరో.


అందుకే.. నారా మామ గేమ్స్‌ను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను ఆరాటపడినా దక్కేదేమీ ఉండని అతడికి తెలుసు. బాబును కాదని తనకు సొంతవాళ్లు పట్టంకట్టరు. బాబు తర్వాత తనను ఆపే శక్తి ఎవరికీ లేదు. అంతవరకూ చూస్తూ ఉండటమే. ఈ లౌక్యాన్ని తారక్‌ బయటకు ప్రదర్శించకపోయినా.. ఈ లౌక్యంతోనే తను కామ్‌గా ఉన్నాడు. తారక్‌ సైలెన్స్‌ చంద్రబాబును మరింత భయపెడుతూ ఉంది.


ఒకవైపు పార్టీ అధికారంలో నిలపడానికి రేపు తనయుడిని నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు చాలాకష్టమే పడుతున్నాడు. తన సోదరిని గెలిపించాలని పెట్టిన ట్వీట్‌లో కూడా తాత, తండ్రిల ప్రస్తావన తెచ్చాడు కానీ.. జూనియర్‌ ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు. ఇది చాలు.. తారక్‌ అసలు లెక్కలెలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఈ లెక్కలు వారసుడి విషయంలో బాబును మరింత టెన్షన్‌ పెడుతున్నాయి! అసలు కథ వచ్చే ఎన్నికల అనంతరం మొదలు కావొచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: