ఫ్యాన్స్ ని సంతోష పరుస్తున్న ప్రభాస్?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం  పలు భారీ ప్రాజెక్టుల కోసం తీరిక లేకుండా ఎంతో కష్టపడుతూ వర్క్ చేస్తున్నాడు, వాటిలో"కల్కి 2898 AD" సినిమా ఒకటి.అలాగే "రాజా సాబ్" సినిమా వర్క్ కూడా కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ప్రభాస్ చాలా కష్టపడుతూ ఎంతో నిర్విరామంగా పాల్గొంటున్నారు.ఇటీవల ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ క్లిప్ లో ప్రభాస్ కనిపించిన కొత్త లుక్ అభిమానులను ఆందోళనలోకి గురి చేసింది. నార్మల్ గా ప్రభాస్ అంటేనే సాలిడ్ పర్శనాలిటీ ఇంకా మంచి చార్మ్ తో కనిపిస్తారు. అయితే, ఈ కొత్త లుక్ లో ప్రభాస్ గ్లో తగ్గినట్టు ఇంకా తన ఫిట్నెస్ కొంతగా ప్రభావితమైనట్టు కనిపించింది. ఫ్యాన్స్ ఈ విషయం పై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ తన హార్డ్ వర్క్ వల్ల ఎక్కువ రెస్ట్ లేకుండా, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలా గొడ్డులా కష్టపడుతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరో కొంత విరామం తీసుకొని, తన ఆరోగ్యాన్ని చూసుకోవాలని బాగా కోరుకుంటున్నారు.


ప్రభాస్ ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతున్నప్పటికీ.. ఆరోగ్యం కూడా ముఖ్యమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా ఎల్లప్పుడూ ప్రభాస్ క్షేమం కోరుకుంటారు. కాబట్టి వారి ప్రేమను కూడా ప్రభాస్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, మంచి కంటెంట్ తో అభిమానులను సంతోష పరుస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్  ద్వారా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసి వైరల్ అయ్యారు. త్వరలోనే తమ జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అనే డౌట్ క్రియేట్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు అన్నట్లుగా కథనాలు బాగా వైరల్ అయ్యాయి. అయితే అది అబద్దం అని తర్వాత కల్కి సినిమా ప్రమోషన్స్ ని బట్టి అర్థమైంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగానే ప్రభాస్ ఆ విధంగా ఒక డౌట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశాడట. ఇక కల్కి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో కూడా కలిసి ముచ్చటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అందువల్ల ఫ్యాన్స్ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: