కేసీయార్లో భయం పట్టుకుందా...!!

Satya
తెలంగాణా ఎన్నికలకు వెళ్తున్నపుడు ఉన్న ధైర్యం, రాజసం ఇపుడు గులాబీ బాస్ లో కొంత తగ్గాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల సభల్లో ఆయన చేస్తున్న ప్రకటనలు, అంటున్న మాటలు చూస్తూంటే ఇది కొంత అర్ధమవుతోంది. మేమే గెలుస్తాం, నూటికి నూరు సీట్లకు పైగా మావే అన్ని చెప్పిన కేసీయార్ స్వరంలో ఇపుడు కొంచెం తేడా కనిపిస్తోంది.


కూటమి నెగ్గితే :


ఇది కేసీయార్ నోటి వెంట వచ్చిన తాజా  మాట. అసలు ప్రత్యర్ధి అంటూ తనకు ఎవరూ లేరని తొడ గొట్టి మరీ బరిలోకి దిగిన కేసీయార్ ఇపుడు మహా కూటమిని బాగానే  పట్టించుకుంటున్నారు. అది ఎంతవరకూ వచ్చిందంటే ఎన్నికల్లో కూటమి గెలిస్తే అంటూ చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఇది జనాలను హెచ్చరించినట్లుగా కనిపిస్తున్నా ఆయనకే తెలియకుండా కొంత కంగారు ఉండడం వల్లనే ఇలా మాట బయటకు వస్తోందని అంటున్నారు. . కూటమి గెలిస్తే కొంప కొల్లేరు అవుతుందని ఓటర్లను చైతన్య పరచడం వరకూ బాగానే ఉన్నా కేసీయార్ మాటలను లోతుగా చూసినపుడు మాత్రం దూకుడు  ఇబ్బంది పెడుతోందనిపిస్తోందంటున్నారు.


బాబే దిక్కా :


ఇక కేసీయార్ అన్ని చేశాం, ఇన్ని చేశామ‌ని నిన్నటి వరకూ చెప్పారు. నాలుగున్నరేళ్ళ కాలంలో టీయారెస్ పాలన కంటే ఎవరు ఎక్కువ చేశారని కూడా నిలదీశారు. తమకు గెలుపు మీద, జనం మీద నమ్మకం ఉంది కాబట్టే ఎన్నికలకు పోతున్నామని కూడా ధీమాగా చెప్పారు. కానీ ఇపుడు మాత్రం కేసీయార్ అభివ్రుధ్ధి పనుల కంటే చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ హవాను తగ్గించాలనుకుంటున్నారు. అంటే ప్రత్యర్ధి బలవంతుడని ఇండైరెక్ట్ గా ఇవన్నీ చెబుతున్నట్లేనా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: