అమృత్ సర్ ఘటన ట్రైన్ డ్రైవర్ సూసైడ్..?

KSK
తాజాగా ఇటీవల దసరా సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ లో జరిగిన రావణ దహన కార్యక్రమం లో జరిగిన విషాద సంఘటన దేశంలోనే సంచలనం అయింది అందరినీ కలచివేసింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా చాలా మంది వీక్షకులు పట్టాలపై ఉండి చూస్తున్న నేపథ్యంలో అదే సమయంలో ట్రైన్ పట్టాలపై వస్తుండగా జనం తప్పుకొని నేపథ్యంలో దాదాపు 60 మంది వరకు ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది.


ఈ నేపథ్యంలో ట్రైన్ క్రింద చనిపోయినవారి మృతికి తాను నైతికంగా భాద్యత వహిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు ట్రైన్ లోకో పైలట్ అరవింద్ కుమార్ ...! ఈ క్రమంలో ఒక లెటర్ కూడా రాశారు లోకో పైలట్ అరవింద్ కుమార్.  " మాకు రావణ దహనం లాంటి విషయం జరుగుతున్నదని ఎటువంటి సమాచారం లేదు,


మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఎప్పుడూ లాగానే మాకు నిర్దేశించిన వేగంలో వెళ్ళాము , ఒక్కసారి అనుకోకుండా రైలుపట్టాలపై జనాలు కనిపించేటప్పటికి హారన్ వాయిస్తూ వచ్చాను , ఆ సమయంలో ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేసాను , ట్రైన్ లో ప్రయాణించే రెండువేల మంది జనాల సేఫ్టీ గురించి ఆలోచించి తర్జన భర్జన పడి ఎమర్జెన్సీ బ్రేకులు వేసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ..


నేను హారన్ కొట్టినప్పటికీ జనాలు కదలలేదు దాని వలన అనుకోకుండా తప్పు జరిగిపోయింది...అంటూ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే జరిగిన విషాద సంఘటన గురించి  రైల్వే శాఖ మాత్రం తమ తప్పు లేదని కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో లోకో పైలట్ చనిపోవడం అందరినీ కలచివేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: