గాంధీజీ మాటలు తూ.చ. తప్పకుండా పాటించిని రాహూల్, సోనియా గాంధీ!

siri Madhukar
నేడు గాంధీ జీ 150వ జయంతి సందర్బంగా ఆయన మాటలు తూచా తప్పకుండా పాటించారు..కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూలు గాంధీ, ఆయన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.  భారత దేశాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి అహింసా మార్గంతో శాంతి యుతంగా పోరాటం జరిపి భారత దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చారు.  అందుకే ఆయనను భారతీయులు జాతిపితగా పిలుస్తారు.  ఇప్పటికే ఆయన పోరాటాన్ని, ఆయన మాటలను ఎంతో మంది నాయకులు స్ఫూర్తిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న సేవాగ్రామ్‌ ఆశ్రమంలో నేడు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో రాహుల్, సోనియాలతో పాటు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనానంతరం సోనియా, రాహుల్ వారి కంచాలను వారే స్వయంగా శుభ్రం చేశారు.  ఇది కాస్త మీడియా దృష్టిలో పడింది. అంతే ఫోటోలు, వీడియోలు ఒక్కసారే వైరల్ అవుతున్నాయి. 

ఎంతో గొప్ప స్థానంలో ఉన్నా..మహాత్ముని మాటలను అక్షరాలా ఆచరణలో పెట్టారు. 1986లో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో ఓ మొక్కను నాటారు. నేడు ఆ చెట్టు పక్కనే రాహుల్ ఓ మొక్కను నాటారు. ఈ ప్రార్థనా సమావేశంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోని, శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.  
#WATCH: Sonia Gandhi and Rahul Gandhi wash their plates after lunch in Sevagram (Bapu Kuti) in Wardha. #Maharashtra pic.twitter.com/hzC3AGe7kj

— ANI (@ANI) October 2, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: