అమెరికాలో కలకలం రేపిన ఆ ఇండియన్‌ హత్య..?

Chakravarthi Kalyan
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను అతని  ప్రత్యర్థులు కాల్చి చంపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాలోని హోల్డ్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు స్నేహితుడితో కలిసి ఇంటి బయట ఉండగా.. అగంతకులు గోల్డీ బ్రార్ పై కాల్పులు జరిపినట్లు మీడియా పేర్కొంది.

అయితే ఈ వార్తలను అమెరికా పోలీసులు ఖండించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో గోల్డీ బ్రార్ హత్య జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. ఈ కాల్పుల్లో మరణించింది 37 ఏళ్ల గ్జావియర్ గ్లాడ్నే అని పోలీసులు వివరించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో నిర్మూలనలో భాగంగా గోల్డీ బ్రార్ ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇంత వరకు బాగానే ఉన్నా గోల్డీబ్రార్ కి అమెరికా వీసా ఎలా లభించింది అనేది ఇప్పుడు అంతు చిక్కని మిస్టరీగా ఉంది. వీసాలకు ఎన్నెన్ని నెలలు, సంవత్సరాలు ఎదురు చూసినా కొంతమందికి ఇంటర్వ్యూలకి అవకాశం రాదు. కానీ ఇతనికి అంత సులభంగా ఎలా వచ్చింది అనేది మీమాంస. ఒకవేళ విజిటింగ్ వీసా ఇచ్చినా ఆరు నెలల తర్వాత అది రద్దై పోతుంది.

కానీ ఇన్నేళ్ల పాటు అతను అమెరికాలో ఎలా తలదాచుకుంటున్నారు. అమెరికా సీఐఏ అండదండలతోనే ఇది సాధ్యం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈయనతో పాటు పన్నూని, నిజ్జర్ తో పాటు భారత వ్యతిరేక శక్తులను అమెరికా కాపాడుతుంది అనడానికి నిదర్శనమే ఈ ఘటన. మన దేశంలో అరాచకాలు సృష్టించి వారికి అమెరికా ఆశ్రయం కల్పిస్తోందనే విషయం తేట తెల్లమైంది. మరి దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో.. వీటిని ఎలా తిప్పి కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: