ఏపీ: భూపట్టాల దుష్ప్రచారం పై.. టీడీపికీ షాక్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి టిడిపి పార్టీ అటు జనసేన పార్టీ ఇద్దరు కూడా భూహక్కు చట్టం పైన పలు రకాల దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రచారం చేస్తూ ఉండడంతో టిడిపి పైన చర్యలు తీసుకోవాలంటు.. వైసిపి ఫిర్యాదు చేసింది..IVRS కాల్స్ ద్వారా టిడిపి దుష్ప్రచారం చేస్తోందంటూ వైసిపి పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈసీ ఇవాళ పలు చర్యలను కూడా చేపట్టింది..iVR కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

అధికార పార్టీ వైసీపీ పైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు.. ఎన్నికల కోడ్కు విరుద్ధంగానే టిడిపి ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ సిఐడి కి ఆదేశాలను కూడా జారీ చేసింది. ఆంధ్రలో వైసీపీ సర్కార్ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన భూహక్కు చట్టం ద్వారా ఎంతో మంది ప్రజలు భూములు లాక్కుంటున్నారంటూ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికలలో ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో టిడిపి కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానే ఇదే అంశాన్ని కూడా ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు.

అయితే ఇందులో కొన్ని నిర్ధారణకానీ విషయాలు అవాస్తవాలు ఉన్నాయంటూ వైసీపీ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయం పైన స్పందించినటువంటి ఈసీ వైసీపీ మాటలను ఏకీభవిస్తోంది.. ఈ మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హరేంధ్రప్రసాద్ ఈ రోజున సిఐడి అదనపు డీజికి టిడిపి చేస్తున్నటువంటి  ఈ దుష్ప్రచారం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది.. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అవాస్తవాలతో ఇలాంటి ప్రచారం చేయడం తప్పని సిఐడి చట్టాల ప్రకారం గాని చర్యలు తీసుకోవాలంటే ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం సిఐడి ఇప్పుడు ఐవిఆర్ఎస్ కాల్స్ పైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: