రాయలసీమ: కేతిరెడ్డి తప్పు చేస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎటువైపుగా వెళుతున్నాయో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది.. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం మరింత వేడి రాజు కుంటోంది. ఇక్కడ కూటమిలో భాగంగా బిజెపి నేత సత్యకుమార్ సీటు దక్కించుకున్నారు.. ఎలాగైనా ఇక్కడ గెలిపించాలని అటు జనసేన, టిడిపి ,బిజెపి నేతలు సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే గా ఉన్న ఈయన చేస్తున్న తప్పు ఏమిటంటే..

బిజెపి కార్యదర్శి సత్య ను టార్గెట్ చేయడమే.. నాకు ఓటెయ్యండి అని అడగడంలో తప్పులేదు కానీ.. నేను ఇది చేశాను మీకు అంటూ ధైర్యంగా అడగవచ్చు. అది మానేసి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కేతిరెడ్డి.. అయితే సత్య అనే వ్యక్తి మొదటి నుంచి ఉన్నత విద్య చదివిన వ్యక్తి Rss విభాగంలో పనిచేసిన వ్యక్తి. అందుకే బిజెపిలో కేవలం ఇద్దరికే ఇద్దరికీ సీట్లు ఇచ్చారు. ఒకటి శ్రీనివాసు వర్మ నరసాపురం.. రెండు సత్యకు మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ నుంచి పని చేసినటువంటి వారికి మాత్రమే సీట్లు ఇచ్చింది. ఒకవేళ వ్యక్తిగతంగా సత్య జగన్ కి వ్యతిరేకంగా ఉన్న టిడిపికి అనుకూలంగానే ఉన్నారు.

కానీ పార్టీ అంటేనే అపారమైన ప్రాణం పెట్టే వ్యక్తి సత్య.. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక అవకాశం వచ్చింది.. గెలవడానికి ప్రయత్నిస్తున్నారు.. అతడిని విమర్శించాలనుకున్నప్పుడు.. అతడి కంటే నేను మెరుగైన పనిచేయగలనని చెప్పాలే కానీ.. దుర్భాషలాడడం తప్పన్నట్లుగా పలువురు నేతలు తెలుపుతున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడిన విషయానికి వస్తే.. ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి బ్రోకర్లు వచ్చారు.. అంతిస్తాం ఇంతిస్తం రాజకీయం చేస్తున్నారు. తాడు బొంగరం లేనోళ్లు కూడా ఈ కేతిరెడ్డిని శాసిస్తారా అంటు ఎద్దేవ చేశారు.

అంతేకాకుండా మా వాళ్ళని ముట్టుకొని పొలిమేర దాటలేరని చెబుతున్న ఐదేళ్ల కిందట అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను అంటూ తెలిపారు కేతిరెడ్డి. ఇలా కార్యకర్తలను ఉద్దేశించి అడుగుతున్నారు కేతిరెడ్డి.. మొదట ఇస్తానంలో పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే సూరి పోటీ పడగా.. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ పోటీపడ్డారు.. జనసేన అంటూ ఇంకొకరు వచ్చారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు.. అక్కడ ఏమి చేయలేని వారు ఇక్కడ ఏమి చేయగలరు అంటూ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన యాదవ వర్గానికి చెందినవారు బీసీ నేతలను కూడా మభ్యపెడుతున్నారని తెలిపారు. ఒక కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి హీరోయిన్లు , కేంద్ర మంత్రులు వస్తున్నారు నేను జనాలని నమ్ముకున్నాను అంటూ తెలియజేశారు కేతిరెడ్డి. కేవలం ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండకూడదని పదేళ్లలో గొడవలు లేకుండా చూసుకున్నమని తెలిపారు. అయితే ఇందులో మాట్లాడడం తప్పులేదు కానీ బ్రోకర్లు తాడు లేని బొంగరోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచిదని పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: