క్రాస్ ఓటింగ్: జగన్ తలరాతను మార్చేనా..?

Divya
•క్రాస్ ఓటింగ్ ఎవరికి వరం
* ఎంపీ అభ్యర్థులలో టెన్షన్ మొదలు..
* జగన్ తలరాత ఈ క్రాస్ ఓటింగ్ మారుస్తుందా..

(అమరావతి - ఇండియా హెరాల్డ్)
నిజం చెప్పాలంటే ప్రజలు చాలా నిజాయితీపరులు.. ప్రలోభాలకు లొంగినా.. అందరికీ న్యాయం చేద్దామనుకునే ఆలోచనలో వాళ్ళు ఉంటారు.. అందుకే ఒక ఓటు ఎంపీ కి.. మరొక ఓటు ఎమ్మెల్యేకి అన్న నీతిని పాటిస్తూ వచ్చారు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. దాంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు పట్టుకుంది.. విశాఖ , అనకాపల్లి , విజయనగరం,  శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులందరికీ కూడా ఈ పరిస్థితి మరింత సమస్యగా మారనుంది అని పోలింగ్ తర్వాత ఆయా పార్టీలు చేసుకున్న మదింపులో ఈ వార్తలు తెలిసినట్లుగా సమాచారం...
నిజానికి సీట్ల కేటాయింపులో రెబెల్స్ ని సముదాయించిన చోట బయటకు నవ్వుతూ కనిపించినా..  చేయాల్సింది మాత్రం చాప కింద నీరుగా చేసుకుంటూ పోయారని.. దానివల్ల వారి ఆలోచనలు ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేసి మమా అనిపించారాని కూడా చెబుతున్నారు.. ఈ దెబ్బతో ఎవరిని విజయం వరిస్తుందో తెలియని విధంగా ఎవరికి వారు టెన్షన్ పడిపోతున్నారు.. క్రాస్ ఓటింగ్ కి పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సీటులో ఈసారి కూడా అలాగే జరిగిందని సమాచారం.. దాంతో బలయ్యేది ఎవరో అని దానిమీద రెండు ప్రధాన పార్టీలలో కూడా చర్చలు మొదలయ్యాయి..

అలాగే విశాఖ ఎంపీ సీటు విషయంలో కూడా క్రాస్ ఓటింగ్ ప్రభావం బాగానే ఉంది.. ఎవరికి వరం  ఎవరికి శాపం అన్నది కూడా ఇప్పట్లో తేలే లాగా లేదు..  అనకాపల్లిలో ఒక అభ్యర్థి లక్ష మెజారిటీతో ఉన్నారు.. మరో అభ్యర్థి రెండు లక్షలు అంటున్నారు.. కానీ క్రాస్ ఓటింగ్ ఇప్పుడు భారీగా దెబ్బతీసింది అని చెబుతున్నారు.. ప్రధాన పార్టీలో పోలింగ్ ముగిసిన తొలిరోజు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు రెండవ రోజు కనిపించడం లేదు.. ఇలా చూస్తే క్రాస్ ఓటింగ్ లీలలు ఎవరికి ఎర్త్ పెట్టనున్నాయి అన్నది ఈవీఎం  విప్పితే తప్ప తెలియని పరిస్థితి అని చెబుతున్నారు.. ఏది ఏమైనా ఈ క్రాస్ ఓటింగ్ పద్ధతి జగన్ కి.. అటు చంద్రబాబుకు తలనొప్పిగా మారిన సాధ్యమైనంత వరకు జగన్ కే అనుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ క్రాస్ ఓటింగ్ జగన్ తలరాతను ఏమైనా మారుస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: