టీడీపి: రంగంలోకి దిగుతున్న సినీ హీరో..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రాజకీయాలే కాకుండా.. మాటలు యుద్ధం కూడా హోరాహోరీ గానే జరుగుతోంది.. ఇప్పుడు ఏకంగా సినిమా యాక్టర్లు సందడి బాగా నెలకొంటుంది. ఎక్స్పెక్ట్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో పోసాని కృష్ణ మురళి , ఆలి ను కూడా ఉపయోగించుకోలేదు జగన్.. కేవలం తనొక్కడే రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే ఒక పక్కన బాలకృష్ణ స్వయంగా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రచారం చేస్తూనే అలాగే ప్రచారం కూడా చేస్తున్నారు. మరొక వైపు నారా రోహిత్ కూడా టిడిపి పార్టీ ప్రచారానికి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నారా రోహిత్ రేపటి రోజున పలాస, అనకాపల్లి స్థానాలలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అక్కడ  బహిరంగ సభతో పాటు రోడ్డు షోను కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఒక పక్కన నారా రోహిత్ చేయబోతున్న ప్రచారం.. ఇంకా మిగతా యాక్టర్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే టిడిపి చేస్తోంది. మరొకవైపు పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో అయితే అటు మెగా కుటుంబం జబర్దస్త్ టీం బుల్లితెర నటీమణులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అలాగే బిజెపి వైపు నుంచి సప్తగిరి , నమిత తదితర సెలబ్రిటీలు సైతం ప్రచారం చేస్తున్నారు.

మొత్తం మీద ఎన్డీఏలో సినీ సందడి విపరీతంగా కనిపిస్తోంది.. మరి ఏ మేరకు ఇలాంటివన్నీ కూటమికి కలిసి వస్తాయో చూడాలి మరి.. ముఖ్యంగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే కూటమి చేస్తూనే ఉంది.. అయితే ఆ ఎత్తులకు మించి మరి అధికార పార్టీ దూసుకుపోతోంది. అయితే ఈసారి ఎన్నికలలో వైసీపీ పార్టీకి సినీ సెలబ్రిటీలు ఏ ఒక్కరు కూడా ప్రచారానికి రావడం లేదు.. అయితే కేవలం ఒక్క యాంకర్ శ్యామల మాత్రమే ఇటీవలే ప్రచారం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: