స్పెషల్ : "అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్" కు గురైన ఏపి వైఫల్యానికి కారణం ఎవరు?

చంద్రబాబు ప్రభుత్వం అసలు పాలన చేస్తుందా? అనేది ప్రజలని వేదిస్తున్న ప్రధాన ప్రశ్న. ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఆత్మస్తుతి పరనింద తోనే కాలం గడిపేస్తు న్నారు. ఆయన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవంతో పాటు వయసు, దానితో పాటు ఆయనలో లెక్కకు మిక్కిలిగా చెలరేగిపోతున్న వృద్ధాప్య రుగ్మతలు అనులోమాను పాతంలో పెరిగిపోతున్నాయి.


ప్రజ లెవరూ నాడు కోరుకోని రాజకీయ మితృత్వం  2014 లో ఆయన నెరిపారు. అదే "టిడిపి-బిజెపి-పవన్ కళ్యాన్" రాజకీయ-బంధం. తద్వారా ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేశారు. వాటిని నెఱవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతగా దానిని ఇతర పక్షాల నుండి సాధించాల్సిన నూరుపాళ్లు బాధ్యత చంద్రబాబుదే.


అటు కేంద్ర ప్రభుత్వంతో. ఇటు పవన్ కళ్యాణ్ తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తన అవసరాలకు తగ్గట్టూ తోలి నాలుగేళ్ళూ వాళ్ళని పొగుడుతూ విభజన ఫలాలను ముఖ్యం గా ప్రత్యేక ప్రతి పత్తి హోదా కోసం పోరాడకుండా స్వజనుల ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను కేంద్రం దగ్గర  ఫణంగా పెట్టి, కాలం గడిపేసి ఎన్నికలు ముంగిట్లోకి ముంచుకు రాగానే ప్రతిపక్షం తొలి నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే దాన్ని తన సహజ గుణమైన యూ-టర్న్ తో హైజాక్ చేసి వీదుల్లోకి తానొక ప్రభుత్వాధినేతనని మరచి "ధర్మపోరాట దీక్షలు" నిర్వహించటం తన రాజకీయ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికే నన్నది మొత్తం తెలుగు జాతికే అవగతమైంది.


నాలుగేళ్ళు ఒకే కంచం ఒకే మంచంగా బిజెపితో సంసారం చేసి ఇప్పుడు బిజెపి అది చేయలేదు ఇది చేయలేదు అంటూ నానా యాగీ చేయటం ధర్మ పోరాటం తొక్కా తోలూ అంటూ వీదుల్లో చిందులేయటం ప్రజలకు అవసరంలేదు. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. దాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రతిపక్షాన్ని రోజు అప్రతిష్ఠ పాల్జేస్తూ బిజెపి-వైసిపి మైత్రి పై రాళ్ళు వేస్తూ శాసనసభ సమావేశాలు నిర్వహించటం శాసనసభ సమావేశాలను వీధిబాగోతం స్థాయికి దిగజార్చిన తొలి భారతీయ ముఖ్యమంత్రి చంద్రబాబే.  


ఎన్ డి ఏ తో రాజకీయ బంధాన్ని విచ్చిన్నం చేసుకున్నాక చంద్రబాబు ఏమీ చేయలేని శూన్యంలోకి పడిపోవటంతో ఇక చేసేదేమీ లేక ప్రతిపక్షం లేని శాసనసభను రాజకీయ వేదికగా చేసి అక్కడే కాక, రహదారుల మీద జిల్లాల్లో తమ పార్టీ మూకలతో కలసి చిల్లర గల్లీ రాజకీయాలు చేస్తూ, గిల్లికజ్జాలతో కేంద్రాన్ని నిందిస్తూ దాదాపు ఈ సంవత్సరంగా కాలం గడిపేస్తున్నారు.


కొంత సంయమనం పాటించి తన సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రణాళికా కాలం వరకు బిజెపితో ప్యాచప్ చేసుకొని, రావలసిన ప్రయోజనాలు రాబట్టకపోగా, ప్రస్తుతం చేతిలో ఉన్న హైదరాబాద్ కామన్ కాపిటల్ ఏర్పాటును ఓటుకు నోటు కేసుతో  కోల్పోయి నేడు ఆంధ్ర ప్రదేశ్ రొడ్దున పడింది. అంతేకాదు కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రోజెక్ట్ ను కమీషన్ల కక్కుర్తితో నెత్తినేసుకొని దాన్ని చేజేతులా నాశనం చేసి - వారం వారం పోలవరం అంటూ దాన్ని పడాకున పడేసింది. బహుశ పోలవరం నిర్మాణ బాధ్యత బిజెపికి వదిలేసి ఉంటే ఏపి ప్రజల్లో కొంతైనా సంతృప్తిని మిగల్చటానికి ఆ ప్రోజెక్టును బిజెపి పూర్తిచేసైనా ఉండేది.


ప్రజలు టిడిపికి అధికారమివ్వగా అధినేత తన బాధ్యత మరచి, పదే పదే కేంద్రాన్ని గోబెల్ ను మరపించే లా నిందిస్తూ, అందులోను తన అనుభవాన్ని తానే పొగుడు కుంటూ ఉంటే చూసే వాళ్లకు వినేవాళ్ళకు విషయమే లేని ఆయన ఉపన్యాసాలు వెగటు విసుగు తెప్పిస్తూ క్రమంగా ఓటెసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది.


ప్రజలు ప్రతిపక్ష హోదా, కట్టబెట్టగా శాసనసభను వదిలేసి, బాధ్యత మరచి సంకల్పయాత్రలు చేసుకుంటూ కదిలే ప్రతిపక్ష నాయకుడు తనను కున్న ప్రత్యేక హోదా ఎలా సాధించగలరు? అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి, సహకరించని బిజెపి, దాది తెన్నూ లేక పిచ్చి పట్టినట్లు ఉపన్యాసాలతో కాలం గడిపే జనసేన, తిరిగి అధికారంలోకి ఏలా? రావాలా?  అనే ఆతృతతో గోతి కాడ నక్కలా కాచుకున్న కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఎలా రక్షిస్తాయో?  ప్రజలకు ఇప్పటికి కూడా అర్ధం కాక ఆందోళనలో పడేస్తున్నాయి.


పోనీ బిజెపితో, కేంద్రంతో, సంభంధంలేని పూర్తి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడవ వలసిన శాంతి భద్రతలు "మన్యంలో మంటలు" రగులుచుతున్నా ఆ మంటల ను చల్లార్చలేని అసమర్ధపాలనలో, రాష్ట్రం ఒక శాసన సభ్యుణ్ణి మరొక మాజీ శాసన సభ్యుణ్ణి మావోయిష్టుల కిరాతకత్వానికి బలి చేసింది. ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలున్నా నిద్రావస్థలో ఉండి ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల హత్యకు కారణమైన పోలీసుల నిర్లక్ష్యం పై ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి. పోలీసుల సంఖ్యలో సింహభాగం అధికార పార్టీ నాయకుల రక్షణకే సరిపోతుంది. ఇక ప్రజా పరిరక్షణకు ఆ వ్యవస్థలో మిగిలిన పోలీసుల సంఖ్య అతి స్వల్పం.


ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వారి కుటుంబాలకు ఎక్స్-గ్రేషియాగా ప్రకటించి చేతులు దులిపేసు కోవటంతో ప్రభుత్వం ఇక మనుగడలో లేనట్లే భావించాల్సి వస్తుంది. పాలన చేతగాని అసమర్ధ నాయకత్వం నియంత్రణలేని వ్యవస్థలతో ప్రభుత్వం పాలన సంబందమైన పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ ) తో కుళ్లి కునారిల్లు తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


ప్రజాధనం ఏడాపెడా ఖర్చు పెట్టటం, నిష్ప్రయోజనకరమైన విదేశీ యాత్రలు చేస్తూ కాలయాపన జేసి వైఫల్యాలు మిత్రులపై, శత్రువులపై నెట్టివేసి తన ప్రయత్నం తాను చేయని టిడిపి దాని అధినాయకత్వం  ఉండటం ఆ రాష్ట్ర ప్రజల దురదృష్టం. 


ఎప్పుడూ విదేశీ యాత్రలు, శంకుస్థాపనలు, ధర్మపోరాటాలు చేస్తూ అధికారంలో ఉండి కూడా బాధ్యత మరచి ఆత్మస్తుతి పరనిందలతో సర్వకాల సర్వావస్థలందు ప్రజల సమక్షంలో అనునిత్యం స్వకుచ మర్ధనం చేసుకుంటూ తన చేతికి ఉంగరాలు, వాచీలు లేవు, నా భార్యే నాకు భోజనం పెడుతుంది, నేను నిప్పు నాకొడుకు పప్పు, వాణ్ని మంత్రి గా నేడు ముఖ్యమంత్రి గా రేపు చేసి మా కుటుంబ ఐరావత భారాన్ని మీరే మోయాలన్నట్లు - ఇంకా రానున్న తరానికి దేవాన్ష్ ను ముఖ్యమంత్రి చేయాలని పరోక్ష ఉద్భోధలు చేస్తూ కాలం వెళ్ల బుచ్చె ముఖ్యమంత్రి నిరుపేదరికం లో మగ్గే రాష్ట్రానికి ఏవిధంగా పనికొస్తాడో?  విఙ్జులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించుకోవాలి.


వీటికితోడు వ్యవస్థల్లో పేరుకుపోయిన అంతులేని అవినీతి, ఆశ్రితపక్షపాతం, కులపిచ్చిరక్తనాళాల్లో ఇంకిపోయిన ప్రస్తుతపరిస్తితుల్లో ఆయన చేసే వ్యవస్థల మానేజ్మెంట్ కు చివరకు న్యాయవ్యవస్థ కూడా చిక్కుకోవటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసంలో పడేసింది.  


కర్ణాటక ఎన్నికల్లో తనకు మాలిన ధర్మం ప్రదర్శించి కాని పని చేసి బిజెపి తో తనకున్న అంతరాన్ని రాజకీయ కక్ష  గా మార్చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాన్ని అడ్దు గోడగా చేసి, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతిపక్షాల్ని, కేంద్రంలోని మిత్రపక్షాన్ని స్వప్రయోజనాలకోసం నిందించటం చంద్రబాబు నాయుడు ఏపి ప్రజల పట్ల చేస్తున్న నేఱం.


సినీరంగంలో అట్టర్-ఫ్లాపైన నటుడు శోంఠినేని శివాజిని కుల ప్రభావంతొ ప్రేరేపించి, అడ్దుపెట్టుకొని, ఆపరేషన్ ద్రవిడ, గరుడ అనేవి సృష్టించి చిల్లర రాజకీయాలకు పాల్పడే ఎవరికీ పనికి రాని చంద్రబాబు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కాల్చనా? ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన 600 వాగ్ధానాల్లో 60 కూడా నేరవేర్చకుండా ప్రతిపక్షాలని కేంద్రాన్ని తిట్టడం అదనంగా ఏపి ప్రజలకు చేస్తున్న ద్రోహం. అలాగే కేంద్రం కూడా ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోతే ఈ పరిస్థితుల్లో ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు లేదు. ఇక ఇక్కడ చంద్రబాబు జాతికి చేసిన తీరని ద్రోహం ఎంతో, అంతే స్థాయిలో నరెంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం చేసిన నష్టం ప్రభావం రానున్న ఎన్నికల్లో చూపవచ్చు కూడా!


అయితే నరేంద్ర మోడీ కి ఏపిలో పోయేది పెద్దగా ఏమీ లేదు కాని దీని ప్రభావం స్వల్పంగా మిగిలిన రాష్ట్రాలపై ఉండవచ్చు. వైసిపి ప్రతిపక్షంగా నిర్వహించాల్సిన తన బాధ్యత వదిలేసి శాసనసభ వెలుపల ప్రజల్లో చుట్టేయటం కొంతవరకు తప్పే. కారణం శాసనసభలో టిడిపి ప్రభుత్వం వైసిపి సభ్యులకు ప్రయోజనాలు ఏరవేసి  "పర స్త్రీలను నయాన్నో భయాన్నో చెరబట్టే రాక్షస లక్షణాలను తీరు ప్రదర్శించటం"  కూడా కొంతవరకు వైసిపి సమాధానంగా చెప్పుకోవచ్చు.


కేంద్రంతో విభేదాల విషయం చంద్రబాబు ప్రభుత్వం చూసుకోవలసిన విషయం. అదీ మొదటి సంవత్సరంలోనె జరగాలి అలా కాకుండా ఎన్నికల సంవత్సరంలో విభజన ఫలాలు సాధించటం పూర్తవ్వాల్సిన సమయంలో అదీ ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక హోదా గుర్తుకు రావటం జనం న్యాయసమ్మతంగా భావంచటంలేదు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పాపం కాంగ్రెస్ ది, విభజనను సమర్ధించి ఆ ఫలాలను అందించ కుండా తాత్సారం చేసిన పాపం బిజెపిది,  నాలుగేళ్లు అగ్రభాగం  స్వప్రయోజనాల కోసం ప్రాకులాడి విభజన ఫలాలను సాధించు కోకుండా బిజెపితో నాలుగేళ్ళు అంట కాగి, చివరకు రాష్ట్ర ద్రోహి  అన్యాయం చేసిన కాంగ్రెస్ కంటే టిడిపి ఏపికి చేసిన ద్రోహం అతి కౄరం.    


విభజన ఫలాలను సాధించకుండా తమ తమపార్టీ సభ్యుల ప్రయొజనాల సాధనలో మునిగిపోయి – ప్రతిపక్షం ప్రత్యెక హోదా సాధనకోసం కృషి చేస్తుంటే దాన్ని బిజెపి తొత్తుగా చెపుతూ కాలయాపన చేసిన పాపం చంద్రబాబును టిడిపిని వదలిపెట్టదు. అన్నీ ప్రయొజనాలను తన కులానికే దారాదత్తం చేసిన చంద్రబాబును ఈ సారి జాతి మొత్తం ఒకటై దెబ్బకొట్టటం రానున్న కాలంలో జరగనున్న పరిణామం. ఒక వైపు కాపులు మరోవైపు బిసిలు ఇంకోవైపు దళితులు చంద్రబాబు చేసిన వాగ్ధానాలు నెరవేర్చ లేదని కినుక వహించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. బ్రహ్మణులు ఈ సారి తెలుగుదేశంపై కత్తులు దూయటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు దేశానికి గెలుపు అసాధ్యం. అది ప్రతిపక్ష నాయకుని సభలకు ఉవ్వెత్తున వస్తున్న జనాలే సాక్ష్యం. ఇక బాబు పాలనకు దిన దిన గండమే.


కుల వర్గ మీడియా కూడా టిడిపికి నేతృత్వంవహిస్తూ వార్తలు రాయటం దాన్ని చదివే ఇతర కులాల వారి కళ్ళలో కనిపించే మౌన మూగ బాష రానున్న ఎన్నికల్లో భళ్ళున బ్రద్దలవటం ప్రస్పుటమవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: