ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం: BJP రాం మాధవ్


కూరిమికల దినములలో....అన్నట్లు మైత్రి నెఱపే సమయంలో అంతా చూడ ముచ్చటే తేడా వస్తేనే మూతివిరుపులు. ఇదీ నేటి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ,  ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ తీరు తెన్నులు. 2014 సాధారణ ఎన్నికలలో విజయం తరవాత వీరి మైత్రి  నన్ను విడచి నీవు పోలేవులే నిన్ను విడిచి న్నేను ఉండలేనులే అన్నట్లు కొనసాగింది.  వీరి మైత్రి చిరకాలం నిలవదు అన్న విషయం అనుభవఙ్జులైన విశ్లేషకులకు ముందే తెలుసు . టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి గత చరిత్ర తిరగేస్తే చాలు స్నేహం వలన లభించే ప్రయోజనం కంటే "బ్రేక్-అప్" లే బలమైన విద్వంసం సృష్టిస్తాయి. వారితో మైత్రి నెరపి విడిపోయిన పార్టీల రాజకీయ శకాలు అంతమయ్యాయి తప్ప వారెవరూ బ్రతికి బట్ట కట్టలేదు. అంటే బాబు స్నేహం కాలకూటవిషంతో సమానం అన్న మాట. 

వేరే ఏ పార్టీకి లేని ప్రత్యేకత టిడిపికి ఉంది ఏమంటే వారి కొసం, వారి చేత, వారి కొరకు ఏర్పడ్ద ఒక సామాజిక వర్గ మీడియా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అలాగే వారి 'యూ.ఎస్.పి ' లేదా వారికే ప్రత్యేకమైన గోబెల్ విధానంలో ప్రచారం గత మూడున్నర దశాబ్ధాల పైగా సాధన చేసి వారి సాధారణ కార్యకర్త నుండి అసాధారణ అధినేత వరకు కరతలామలకం. అంత నైపుణ్యం సాధించటం వారికే సాధ్యం. అయితే కాలం ఎల్లవేళలా ఒకలా ఉండదు కదా! 

ఈశాన్య భారతాన్ని ఏడు దశాబ్ధాలుగా అవిచ్చిన్నంగా పాలించిన భారత జాతీయ కాంగ్రెస్ ను మూలాల నుండి తొలగించి భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన బాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి  వారణాసి రాం మాధవ్ ఇప్పుడు ఏపి బిజెపిపై దృష్టి పెట్టనున్నారని, దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. అది నిజమే నన్నట్లు ....

2019లో తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితిలోను ఓడించి తీరాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ విభాగం ఇటీవల జరిగిన తన సమావేశంలో తీర్మానం చేసింది. ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ గా ఆయన అబివర్ణించారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి,  2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రూ 8.50 లక్షల కోట్లవిలువైన ఆర్ధిక సామాజిక ప్రాకృతిక  వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఆ వనరులను తన కుతంత్ర రాజకీయాలతో తన కుల పంచమాంగ దళాలతో దోచేసి  అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇతోదికంగా నిదులు ఇస్తున్నా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామ్ మాదవ్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో మాట్లాడుతూ  రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచింది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది అని రాంమాధవ్‌ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ఇతోధికంగా నిధులు అందజేస్తోందని రాంమాధవ్‌ చెప్పారు. అయినా కేంద్రం నిధులివ్వడం లేదంటూ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన బంధువు లకు, కుటుంబ సభ్యులకు రాష్ట్ర వనరులను కట్టబెడితే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు అన్ని రకాలుగా దోచుకు తింటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

2014లో తుప్పు పట్టిన టీడీపీకి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోబట్టే మహర్దశ వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్‌ జైన్, రాష్ట్ర ఇన్‌-చార్జి మురళీధర్, కో-ఇన్‌-చార్జి సునీల్‌ దియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహరావు, ఎంపీ లు హరిబాబు, గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్, ఎమ్మెల్యేలు  మాణిక్యాలరావు, ఆకుల సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: