మా జట్టు ఓటమికి.. పూర్తి బాధ్యత నాదే : హసరంగ

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇక ప్రేక్షకుల అంచనాలు ఎన్నో టీమ్స్ విషయంలో తారుమారు  అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పటిలాగానే ఐసీసీ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అద్భుతంగా రానిస్తాయని టైటిల్ పోరులో ముందు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి.

 ఈ క్రమంలోనే మాజీ ఛాంపియన్గా కొనసాగుతున్న పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి అగ్రశ్రేణి టీమ్స్ సైతం కనీసం సూపర్ 8 లో కూడా అడుగు పెట్టలేకపోయాయి. కేవలం లీగ్ దశతోనే చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా జట్లు తీవ్ర స్థాయిల విమర్శలు ఎదుర్కొంటున్నాయ్. అయితే జట్టు వైఫల్యం అని కొంతమంది మాజీలు విమర్శలు చేస్తుంటే.. కేవలం కెప్టెన్ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది అంటూ మరి కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తమ జట్టు వైఫల్యాలపై ఆ జట్టు కెప్టెన్లు స్పందిస్తూ వివరణ ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 అయితే పాకిస్తాన్ దారుణమైన ప్రదర్శనకు కేవలం జట్టు పూర్తి వైఫల్యం మాత్రమే కారణం అని కేవలం తాను ఒక్కడినే కారణం కాదు అంటూ పాక్ కెప్టెన్ బాబర్ అన్నాడు. ఇదే విషయంపై స్పందించిన శ్రీలంక కెప్టెన్ హస్సరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  టి20 వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యానికి కారణాలు ఏమైనా తనదే పూర్తి బాధ్యత అంటూ హసరంగా తెలిపాడు  పిచ్ లపై నింద మోపబోను అంటూ స్పష్టం చేశాడు. ఇతర జట్లు ఇదే పిచ్ లపై మ్యాచులు ఆడాయి అని గుర్తు చేశాడు. అయితే గ్రౌండ్ పరిస్థితులకు తాము అడ్జస్ట్ కాలేకపోయాము అంటూ తెలిపాడు. అయితే శ్రీలంక సూపర్ 8 కి అర్హత సాధించాలంటే ఆ జట్టు గెలుపుతో పాటు ఇతర టీమ్స్ కి గెలుపు ఓటములపై  కూడా భవితవ్యం ఆధారపడటంతో చివరికి శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: