పవన్ కళ్యాణ్ కంటి సమస్యలు... 2019 లో పోటీ ఉంటుందా..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ తీవ్రమైన కంటి నొప్పి తో భాద పడుతున్నాడు. ఇప్పటికే రెండు ఆపరేషన్స్ జరిగినాయి. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పవన్ జనాల్లో ఖచ్చితంగా తిరగాల్సిన పరిస్థితి అయితే డాక్టర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కు విశ్రాంతి అవసరం అని చెబుతున్నారు. ఇప్పటికీ జనసేన అంటే పవన్‌కళ్యాణ్‌ తప్ప ఇంకొకరు లేరు. వున్నా, లేనట్టే లెక్క. ఎందుకంటే, వాళ్ళెవరూ కనీసం.. జనంలోకి వెళ్ళి, జనసేన 'వాయిస్‌' ఇదీ అని బలంగా చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారు. 


ఎన్నికల ముందు పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవడం కష్టమే. పార్టీని జనంలోకి తీసుకెళ్ళడం.. నాయకుల్ని తయారు చేసుకోవడం.. వారిని జనానికి పరిచయం చేయడం.. ఇదంతా ఓ పెద్ద ప్రసహనం. పదిమంది ఎమ్మెల్యేల టచ్‌లో వున్నారు.. పాతిక మందికి పైగా నేతలు లైన్‌లో వున్నారు.. వంటి మాటలు వినడానికి బాగానే వుంటాయిగానీ, ఆ మాటలకి ఎక్కువ విలువ వుండదు.


ఎంతవేగంగా మాటలు పుడతాయో, అంతే వేగంగా ఆ వేడి చల్లారిపోతుంది. జనసేన టీమ్‌ని రాష్ట్రంలోని పలు జిల్లాలకు పంపడం, అక్కడి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమో.. ఆ సమస్యల్ని హైలైట్‌ చేస్తూ ప్రజా పోరాటాల్ని చేయించడమో.. ఇప్పటికే చేసి వుండాలి జనసేన. కానీ, జనసేనాని ఆ దిశగా సరైన కార్యాచరణను పార్టీ శ్రేణులకు అందించలేకపోయారు. ట్విట్టర్‌లో హడావిడి, మీడియాకి కొన్ని 'నోట్‌'లు పంపడంతోనే సరిపెట్టేస్తున్నారు. అధికార పార్టీపై ఆరోపణలు, ప్రతిపక్షంపై విమర్శలు.. ఇవన్నీ అభిమానుల్ని ఉత్సాహపరిచేవే తప్ప, సాధారణ ఓటర్లను ఆకర్షింపజేసేవి కావు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: