బ్రేకింగ్: వైఎస్ జగన్ ను కలవనున్న మంత్రి భూమా అఖిలప్రియ..!

KSK
వైసీపీ పార్టీ నుండి ఎన్నికై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ అతి కొద్దికాలంలోనే మంత్రి పదవి చేపట్టారు. భూమా అఖిలప్రియ కి వైయస్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జగన్ జైల్లో ఉన్న సందర్భంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి వైయస్ జగన్ తల్లి విజయమ్మ వెనకనుండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని రాత్రివేళ ఇంటికి చేరుతున్న క్రమంలో మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు శోభానాగిరెడ్డి చనిపోవడం జరిగింది.


ఒక విధంగా చెప్పాలంటే శోభా నాగిరెడ్డి మరణం వైయస్ జగన్ కుటుంబానికి చాలా బాధాకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ తనయుడు తో భూమా అఖిలప్రియ వివాహం అవ్వడం జరిగింది. అయితే అతి కొద్దికాలంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి అయిన తర్వాత అఖిల ప్రియా మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ తో పెళ్లికి రెడీ అయిపోయింది.


ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల దగ్గర లో ఆమె పెళ్లి జ‌రుగ‌నుంది… ఇప్ప‌టికే వివాహ ఆహ్వాన పత్రికలను మంత్రి కుటుంబ సభ్యులు అందరికి పంపుతున్నారు…. అఖిల పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇటీవ‌లే మంత్రి అఖిలప్రియ తన సోదరి నాగమౌనిక, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి తెలుగురాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను క‌లిసి పెళ్లి కార్డు అంద‌చేశారు.. పెళ్లికి కుటుంబ స‌మేతంగా ఆహ్వ‌నించారు. ఇటు కేటీఆర్ ను కూడా క‌ల‌వ‌డం జ‌రిగింది ఆయ‌న్ని పెళ్లికి ఆహ్వానించారు.


అయితే అఖిల జ‌గ‌న్ ఫ్యామిలీని కూడా పెళ్లికి పిల‌వాలి అని భావిస్తున్నారు అని తెలుస్తోంది..రాజ‌కీయం – బంధుత్వానికి సంబంధం లేదని,ఆమె ఆలోచిస్తోంద‌ట.. అఖిల పెళ్లి కార్డు జ‌గ‌న్ ఫ్యామిలీని కలిసి ఆమె సోద‌రితో క‌లిసి శుభ‌లేఖ ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర లో బిజీగా ఉన్న జగన్ ని ఆమె సోదరుడు ఆహ్వానిస్తారని సమాచారం. మంత్రి అఖిలప్రియ స్వతహాగా వై.ఎస్.విజయమ్మ ని భారతిని కలసి పెళ్లికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు సీమ ప్రాంతం నుండి వార్తలు వినబడుతున్నాయి. మరి వినపడుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజమో మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: