టిడిపి అంతం - బిజెపి పంతం: ప్రత్యేక కార్యవర్గ ఏర్పాటు

2019ఎన్నికలలో తెలుగుదేశం పార్టీయే ప్రధానలక్ష్యంగా బరిలోకి దిగనుంది భారతీయ జనతా పార్టీ. 2014ఎన్నికలలో తమతో చేతులుకలిపి, కలకాలం కాపురం చేస్తుంద ను కున్న తెలుగు దేశం పార్టీ తమను వీడి వేరు కుంపటి పెట్టడం బిజేపి నాయకులకు మింగుడు పడడం లేదు సహించటం లేదు.

తమ గెలుపు మాట ఎలా ఉన్న తెలుగు దేశం పార్టీ దాని అధినేత చంద్రబాబు మాత్రం తిరిగి అధికారం లోకి రాకూడదని, రానీయకుండా చేయాలని బిజేపి పట్టుదలతో  ఉంది. నాలుగేళ్ళు తమతో స్నేహం చేసి "ప్రత్యేక పాకేజీ కోరి మరీ దాన్ని సాధించుకొని" అందుకు తమ పార్టీ నాయకులకు సన్మానాలు చేసి చివరకి తమకు నమ్మక ద్రోహం చేసి యూటర్న్ తీసుకున్న చంద్రబాబుకు రాజకీయంగా చెక్ పెట్టాలని బిజెపి తన ప్రయంత్నాలు కొనసాగిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిపై బిజేపీ నేతలు రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి పకడ్బందిగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిజేపి అధిష్టానం 19మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని నియమించింది. కార్యవర్గంలో సత్యమూర్తి, సురేష్ రెడ్డి, మాణిక్యాలరావు, శ్యామ్ కిశోర్ లతో పాటు కొంత మంది అధికార ప్రతినిధులు కూడా  ఉన్నాట్టు సమా చారం. ఇందులో  చంద్రబాబుని నిత్యం దుమ్మేత్తి పోసే నాయకులు, తెలుగు దేశం పార్టీ అంటే విరుచుకుపడే వారిని, కార్యవర్గంలో అభ్యర్దులుగా ఉంటారని తెలుస్తోంది.

ఎన్నికలలో ప్రత్యర్దులను విమర్శించడం పరిపాటే, కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం తెలుగు దేశం పార్టీని ఇరుకున పెట్టడానికే బిజేపి బరిలోకి దిగుతోంది. సభ్యులు అందరు టిడిపి ద్వారా తమపై వచ్చిన విమర్శలను, దుష్ప్రచారన్ని తిప్పి కొట్టడమే లక్ష్యం అని చెబుతున్నప్పటికీ. వారి ఉద్దేశం ప్రత్యేక దీక్ష మాత్రం తెలుగు దేశం పార్టీని ఇబ్బందుల పాలు చేసి, ఓటమి పాలు చేయడమే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: