పార్లమెంటులో తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు..!

KSK
తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మనలను అందుకోడానికి ప్రయోగించిన అవిశ్వాసం పార్లమెంట్ పాచిక విఫలం అయిపోయింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పార్లమెంటు సాక్షిగా తన కులా బుద్ధిని మరొకసారి బయటపెట్టారు. రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని కేంద్రంపై పోరాటమని డాంబిక మాటలు రాష్ట్రంలో చెప్పి పార్లమెంట్లో తన సామాజిక వర్గానికి చెందిన సభ్యుల చేత పోరాటం అంటూ నీచ రాజకీయాలకు తెగబడ్డారు చంద్రబాబు.


తమకు తక్కువ సమయంను ఇచ్చిందని చెప్పి ఉన్న సమయం కూడా సద్వినియోగం చేయకుండా సినిమా ప్రస్తావన తో ప్రక్కదారి పట్టింది. టిడిపి కి లోకసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నరసింహులు కి అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం కల్పించకుండా చంద్రబాబు కేశినేని నాని కి అవకాశం కల్పించడం ,అలాగే అవిశ్వాసం పై మాట్లాడే అవకాశం గల్లా జయదేవ్ కి కల్పించటం వివాస్పదం గా మారింది.తన సామాజికవర్గం వారి కి ప్రాముఖ్యత కల్పించి ఇతర సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంలేదు అని ప్రజలు బావిస్తున్నారు.


బీసీ ఎంపి ఎంపిలకు కానీ ,ఎస్ సి వర్గానికి చెందిన వారిలో అనుభవం ఉన్న వారి కి అవకాశం కల్పించలేదు. ఎస్ సీ ఎం పి లలో కేంద్ర ప్రభుత్వములో ఉన్నత స్థానాల్లో పని చేసిన వారి కి కూడా అవకాశం కల్పించలేదు . టిడిపి లో ఉన్న వివక్ష, ఒకే సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తున్నారు అనడానికి ఉదాహరణ గా చెప్పవచ్చు.


ఇలా తన సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం చేయడం చంద్ర బాబు 40 సంవత్సరాల అనుభవం తో చేసి నిర్ణయమా లేదా పెత్తనం చెలాయిస్తున్న చినబాబు నిర్ణయమా టిడిపి ప్రజలకు చెప్పాలి. తాజా పరిణామంతో రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తమ ఓటు ద్వారా సరైన తీర్పు ఇస్తామని అంటున్నారు రాష్ట్ర ప్రజలు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: