టీడీపీ దీక్షల మీద సర్వత్రా విమర్శలు..!

Prathap Kaluva

టీడీపీ ఎంపీ చేసిన దీక్ష ఎంత కామెడీ అయిందో మనమందరము చూసాము. ఇప్పడూ టీడీపీ మరో దీక్ష అని మొదలుపెట్టింది. మొదటి దీక్ష ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పడు కూడా జరుగుతున్న దీక్ష కూడా సర్వత్రా విమర్శలపాలౌతుంది. దీక్ష లో విశాఖ జోన్ గురించి మాట్లాడకుండా జగన్ మీద లేదా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. 


కేవలం తాము పోరాడుతున్నట్లుగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసుకోడానికి, ఓట్లు అడుక్కోడానికి చేసిన ప్రయత్నంగానే ఇది సాగింది. జోన్ సాధించడం గురించి దాని ఆవశ్యకత గురించి కంటె మోడీ అండ్ కోను తిట్టిపోయడంలోనే నేతలంతా కాలంగడిపారు. అది కూడా ఓకే.. పవన్ ను, జగన్ ను ఆడిపోసుకోవడంలోనే ప్రసంగాలను వృథాచేశారు.  ఎన్నికల ప్రచార బహిరంగ సభలను తలపించే రీతిలో సభలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా.. అక్కడికేదో తాము రాష్ట్రం కోసం తపించిపోతున్నట్లుగా వారు బిల్డప్ లు ఇస్తుటారు. అలాంటి ప్రహసనాల్లో భాగంగానే విశాఖ జోన్ కోసం చేసిన రిలేనిరాహార దీక్ష కూడా కనిపిస్తోంది.


తాను పార్టీ వీడిపోతాననే విమర్శలకు జవాబివ్వడానికి ఒకరు.. జగన్, పవన్ ల మీద బురద చల్లడానికి, చంద్రబాబు భజన చేయడానికి.. దాదాపుగా అందరూ తమ ప్రసంగాల్లో రెచ్చిపోయారు. ఇది ఎన్నికల బహిరంగ సభ లాగా సాగిందే తప్ప.. జోన్ కోసం చేసిన దీక్షలాగా సాగలేదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. అటు ప్రత్యేకహోదా కోసం గానీ, నిన్న కడప ఉక్కుకోసం గానీ, ఇవాళ విశాఖ జోన్ కోసం గానీ తెదేపా చేస్తున్న దీక్షలన్నీ కూడా ఎన్నికల ప్రసంగాలను తలపించేలాగా సాగుతున్నాయే తప్ప.. పోరాడుతున్నట్లుగా లేవని పలువురు విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: