భీమిలీ నుంచి గంటా తనయుడు పోటీ ?

Satya
టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వారసుడు వచ్చేస్తున్నాడు. 2019 ఎన్నికలలో కుమారుడు రవితేజాను భీమిలీ నుంచి పోటీకి దించేందుకు గంటా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికలలో తండ్రి గెలుపు కోసం ప్రచారం చేసిన తరువాత రవితేజ రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఈ మధ్యలో ఓ సినిమాలో హీరోగా కూడా చేశారు. అయితే వచ్చే ఎన్నికలలో తనతో పాటు కొడుకుని కూడా పోటీ చేయించాలని చూస్తున్నారు. అందుకోసమే భీమిలీ సీటు రెడీగా వుంచారు.


టీడీపీ నేతలతో భేటీ
లేటెస్ట్ గా భీమిలీలోని గంటా ఆఫీస్ లో ఏకంగా తండ్రి సీటులోనే కూర్చుని మరీ టీడీపీ నాయకుల మీటింగ్ ని రవి తేజ నిర్వహించారు. పార్టీ పొజిషన్ తో పాటు, కార్యకర్తల అభిప్రాయాలను కూడా ఫీడ్ బాక్ తీసుకున్నారు. గంటా ఓడిపోతాడని సర్వే వచ్చిన తరువాత  రవి తేజ ఈ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ బాగానే వుందని, మంత్రి  జనంలో ఎక్కువగా తిరగలేదన్న అసంత్రుప్తి మాత్రం వుందని క్యాడర్ వివరించారు.


ఆ కామెంట్స్ అర్ధమేంటో..!
పార్టీ సంగతి పక్కన పెడితే మా కుటుంబానికి ఎనలేని ఆదరణ భీమిలీలో వుందని, ఎవర్ని నిలబెట్టినా గెలవడం ఖాయమని రవితేజ కామెంట్స్ చేశారని టాక్. ఈ కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. గంటా ఫ్యామిలీ ఈసారి టీడీపీ నుంచే పోటీ చేస్తారా. లేక వేరే పార్టీ నుంచా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.


జనసేన జెండాతో అరంగేట్రం ..?
గంటా తనయుడు జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. అంటే గంటా కూడా సైకిల్ దిగిపోతారన్నది గ్యారంటీ అంటున్నారు. జన సేనలో చేరి తన  రాజకీయ అనుభవంతో చక్రం తిప్పాలని గంటా థింక్ చేస్తున్నారని, పనిలో పనిగా తన కుమారుడికి కూడా టిక్కెట్ ఇప్పించుకుంటారని అంటున్నారు. ఈ ప్లాన్ కారణంగానే ఆయన టీడీపీతో దూరం పాటిస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. మొత్తానికి గంటా నుంచి షాకింగ్ న్యూస్ తొందరలోనే రావచ్చునంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: