తెలంగాణలో కాంగ్రెస్ కి భారీ షాక్!

siri Madhukar
తెలంగాణలో ఈ మద్య రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి.  మొన్నటి వరకు వివిధ పార్టీల వారు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.  కానీ ఈ మద్య కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు.  మొన్నటి వరకు కాంగ్రెస్ కి ఎంతో విధేయుడిగా ఉన్న దామోదర్ రెడ్డి అనూహ్యంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం పై పార్టీ నేతల చర్చలు జరుగుతున్నాయి.

ఈ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు ఇతర నేతలు ఎడ్మ కృష్ణారెడ్డి, జాన్ అబ్రహంలు కూడా కారెక్కబోతున్నారు. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై ఆయన అలకబూనారు.  గతంలో నాగం పై పలుమార్లు పోటీ చేసి నెగ్గిన దామోదర్ రెడ్డి..నాగం కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు.

పార్టీ నాయకత్వం నాగంను పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో, తన మాటకు విలువ లేకుండా పోయిందనే భావనతో పార్టీ మారాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. మరోవైపు, ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. టీఆర్ఎస్ 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించాలనేది ఉద్దేశ్యంతో సీనియర్ నేతలను ఆహ్వనిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: