ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తుంటే.. సిగ్గేసింది : నటుడు

praveen
సాధారణంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బోల్డ్ నేస్ విషయంలో ఎలాంటి లిమిట్స్ ఉండవు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి కూడా అక్కడ ఇక మితిమీరిన బోల్డ్ సీన్స్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ అటు టాలీవుడ్ కి కూడా పాకిపోయింది. అయితే అటు సినిమాలకు అయినా కనీసం సెన్సార్ కట్స్ ఉంటాయేమో కానీ ఈ మధ్యకాలంలో  వెబ్ సిరీస్ లకు మాత్రం ఇలాంటి కట్స్ లేకుండా పోతున్నాయి. దీంతో ఇక సినిమాలకు మించిన మితిమీరిన శృంగార సన్నివేశాలు అటు వెబ్ సిరీస్లలో కనిపిస్తూ ఉన్నాయ్. ఇలాంటి వెబ్ సిరీస్ లు కొన్ని కొన్ని సార్లు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి అని చెప్పాలి.

 ఇక ఇక మరోవైపు ఇలాంటి మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలని వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ సంజయ్ లీల బన్సలి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హీరామండీ వెబ్ సిరీస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ గా హీరామండి రికార్డు సృష్టించింది. ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ తెరకెక్కాగా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సిరీస్ గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఇందులో కొన్ని సన్నివేశాలను మితిమీరిన రొమాంటిక్ సీన్స్ కూడా ఉండటం గమానర్హం. సోనాక్షి సిన్హా  నటుడు ఇంద్రేష్ మాలిక్ మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఈ సీన్స్ గురించి ఇటీవల ఇంద్రేష్ మాలిక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎంతగానో సిగ్గు అనిపించింది అంటూ తెలిపాడు. ఈ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఆమె తల్లి కూడా సెట్స్ లోనే ఉన్నారు. దీంతో నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో రిలాక్స్ గా ఉండమని సోనాక్షి నాకు చెప్పారు. అయితే సీన్ కు ముందే డైరెక్టర్ అని సీన్స్ వివరిస్తారు. అందుకే ఇక షూటింగ్ సమయంలో సీన్స్ చేయడం ఎంతో సులభంగా మారుతుంది అంటూ ఇంద్రేష్ మాలిక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: