చంద్రబాబుకు ప్రమాదకరమైన మందులేని జబ్బా! అందుకే ఈ తీరున ప్రవర్తిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక విచిత్రమైన అలవాటుందని మనకందరికి తెలుసు. చంద్రబాబు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిని తిట్టాలంటే ఒక ఆది నారాయణ రెడ్దినో,  ఒక జెసి దివాకరరెడ్దినో అందుకు వాడేస్తారు. ఎవరూ దొరక్క పోతే ఆస్థాన విద్వాంసుడు సోమిరెడ్ది చంద్రమోహనరెడ్ది ఉండనే ఉన్నాడు.

అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవమత సానుభూతి పరుడని, ఆయన టిటిడి-పాలకమండలి చైర్మన్ గా ఉండరాదని ఎదిరించిన, శివస్వామిపై యాదవ సమాజం మొత్తం చేత చంద్రబాబు దాడి చేయించారు.  అలాగే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను తిట్టాలంటే ఆయన కులానికే చెందిన చలమలశెట్టి రామానుజయను తిట్టడానికి వాడేయటం మనం చూస్తూనే ఉన్నాం. 


ఇక రోజా లాంటి ఫైర్ బ్రాండ్ ను తిట్టాలంటే మొత్తం టిడిపిలోనే సరైన మగాడు లేనిపరిస్థితిలో ఆమెను తిట్టి బ్రతకటం అసాధ్యం కనుక ఎప్పుడూ ఏదో ఒక పదవి కోసం అర్రులు చాస్తూ దాని కోసం ముక్కుతూ మూలుగుతూ ఉండే అనితను వాడేస్తారు. పాపం ఆమెకు టిటిడి పాలక మండలి సభ్యురాల్ని చేస్తే గతం లో బైబిలు లేక తాను లేనని చెప్పిన వనితా చానల్ ఇంటర్వ్యూ కొంపముంచింది. ఇక ఆమె రాజకెయ జీవితం రోజాని తిట్టటానికి తప్ప ఎందుకూ కొరగాదని తేలిపోయింది. ఇలా ఒక్కొక్కళ్ళని వాడేస్తూ పోతుంటే టివిలో వాళ్లని చూడగానే ఈ రోజు ఏదో తిట్టుడు కార్యక్రమం ఉందని అర్ధమై చానల్ మార్చేస్తున్నారు జనం. దాంతో ఆ ప్రోగ్రాం టిఆర్పిలు పూర్తిగా డ్రాపై పోతున్నాయి.  


అయితే ఇది ఒకరకమైన జబ్బు అని దీనికి భారత్ లో మందులేదని ముద్రగడ చెప్పారు. అంటే మహానుభావుడు సినిమాలో అతి శుభ్రం జబ్బు ఓసిడి-అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటిదే "ఒకరిని తిట్టాలంటే అదే కులానికి/మతానికి చెందిన నిలయ విద్వాంసుణ్ణి తిట్టటానికి వాడేయటం అన్న మాట" 
 
 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈ మేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలంటూ డిమాండ్‌ చేశారు. తరచూ చంద్ర బాబు తనను తాను నిప్పు అని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని అన్నారు. బురద చల్లడం చంద్ర బాబు కు కొత్తేం కాదని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు వుంటే బయటపెట్టి తనని ముద్దాయిని చేయాలని, అలా చేస్తే ఇద్దరి నిజ స్వరూపం లోకానికి తెలుస్తుందని ముద్రగడ అన్నారు. ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని వెల్లడించారు. తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు. చంద్ర బాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాట్లు వస్తుంటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారత దేశంలో చంద్ర బాబు కున్న ఈ రోగానికి మందు లేదని, అందుచేత జబ్బు బాగా ముదిరి పోయిందని ముద్రగడ ఎద్దేవా చేశారు. లోకేష్‌ మంత్రి పదవి కోసం ఓ పూజారిని సంప్రదించారని, కానీ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్ర బాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని నిలదీశారు. వంశ పారపర్యంగా అర్చకత్వం ఉండకూడదన్న చంద్రబాబు, తన రాజకీయ వారసుడిగా ఉన్న లోకష్‌కు ఈ నియయం ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: