జగన్: పువ్వుల్లో పెట్టి అధికారాన్ని ఇస్తున్న బాబు.. పవన్..!

Divya
టిడిపి బిజెపి జనసేన కూటమిగా ఏర్పడి ఈసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరు చేస్తున్న పని వల్ల అటు వైసీపీ పార్టీకే కలిసొస్తుందని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ముఖ్య కారణం కూటమి అనే  వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వైసిపి, కూటమి మేనిఫెస్టో విడుదల అయిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కూటమి మేనిపోస్టు కాపీ అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

గతంలో సూపర్ సిక్స్ హామీలను విడుదల చేసిన టిడిపి పార్టీ ఈసారి జనసేన టిడిపి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇందులో బిజెపి పార్టీ మాత్రం భాగస్వామ్యం కాకపోవడంతో ఈ మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో వైసిపి మేనిఫెస్టోకు టిడిపి జనసేన మేనిఫెస్టో విలువ పెంచినట్టుగా అయ్యిందని తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు, పవన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కానీ హామీలను సైతం ఇవ్వడం వల్లే బిజెపి వీరిని దూరం పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.

కూటమి మేనిఫెస్టో పథకాలు అమలు చేయాలి అంటే.. రూ.1.75 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంక్షేమాలు అమలు కావాలి అంటే మొత్తం మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరమన్నట్లుగా కనిపిస్తోంది.. దీంతో ప్రజలు కూడా ఈ కూటమి మేనిఫెస్టో అమలు అయ్యేది లేదు చచ్చేది లేదని మాట్లాడుకుంటున్నారు.. వీటితో పాటు వైసీపీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా చేస్తారనే నమ్మకం ప్రజలలో పెరిగిపోయింది. మోదీ సర్కార్ కూడా టిడిపి మేనిఫెస్టోకు నిధులు ఇవ్వడం జరగదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. పవన్ ,చంద్రబాబు ఇద్దరు కూడా ప్రజలని మోసం చేయాలని విధంగా చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టారు. అదే ఇప్పుడు కూటమికి చేటుగా మారుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి అధికారం వైసీపీ పార్టీకి పువ్వుల్లో పెట్టి ఇస్తున్నారేమో అనితగా కనిపిస్తోంది బాబు పవన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: