ఏసీబీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే డుమ్మా!

Edari Rama Krishna
బినామీ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఆయన తరఫున లాయర్‌ సుధాకర్‌రెడ్డి ఏసీబీ ఎదుట హాజరయ్యారు. కాగా, బినామీ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏసీబీ ముందు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీంతో ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తన ఆస్తులను చూపించారా లేదా అని ఏసీబీ పరిశీలించింది.

అలాగే ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇచ్చేందుకు రావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ సమాచారమిచ్చింది. కానీ ఆయన  ఏసీబీ విచారణకు హాజరుకాలేదు.  ఈ సందర్భంగా లాయర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దుర్గాప్రసాద్‌ అక్రమాస్తులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రభుత్వం  చేసిన కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేను ఇరికించాలని చూస్తోంది అని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కంటి ఆపరేషన్ కారణంగా ఏసీబీ విచారణకు హాజరుకాలేదన్నారు. ఈనెల 29న ఎమ్మెల్యే హాజరుకావాలని ఏసీబీ అధికారులు తెలిపారని లాయర్‌ సుధాకర్‌రెడ్డి చెప్పారు.

ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌‌కి చెందిన  అక్రమాస్తులు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11గంటలకు రామకృష్ణారెడ్డి ఏసీబీ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: