రాజకీయ రొంపిలోకి తిరుమలేశుడుని లాగడంలో సక్సెస్ అయిన ‘ఆ.. లీడర్స్’..!!

Vasishta

టీటీడీపైనా, తిరుమల ఆలయ పవిత్రత, స్వామి వారి ఆభరణాల అపహరణ విషయంలో రమణదీక్షితులు చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అర్చకులే రెండు వర్గాలు విడిపోయి ఆరోపణలు చేసుకుంటుండగా మరోవైపు... రమణదీక్షితులకు మద్దతుగా వైసీపీ ఎంటర్ అవడంతో ఈ వివాదం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది? పాపమెంత గలిగినా .. పరిహరించేందుకు నా పాల కలదు నీ నామము.. అన్నట్టు.. తిరుమల కొండపై మితిమీరిన రాజకీయ జోక్యం.. అర్చకులు.. అధికారుల  మధ్యే ఆధిపత్య పోరాటాలు.. అవినీతి ఆరోపణలు తిరుమల పవిత్రతను ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఎన్ని పాపాలు చేసినా.. శ్రీవారి సన్నిధిలో ఉంటూ ఆ పాపాలను కడిగేసుకుంటున్నారా అన్నట్టు.. తిరుమల కొండపైనే కొలువుదీరిన వీరంతా ఇలా.. ఒకరినొకరు కించపరుచుకుంటూ దేవదేవుడిని ప్రతిష్టను దిగజారుస్తున్నారేమోనని సగటు భక్తుడు ఆవేదన చెందుతున్నాడు. 


శ్రీవారి ఆభరణాలు, పూజాది కైంకర్యాల విషయంలో రమణదీక్షితులు ఆరోపణలతో  మరోసారి తిరుమలలో ఆధిపత్య పోరాటాలు.. అవినీతి ఆరోపణల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. పవిత్ర పుణ్యక్షేత్రం చుట్టూ రాజకీయాలకు అతీతంగా  తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీ  మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రశ్నించిందునే తనను పదవీ విరమణ సాకుతో తప్పించారని ఆరోపించారు. అన్నింటికీ మించి..  మైసూరు మహారాజులు ఇచ్చిన ఆభరణంలోని గులాబీరంగు వజ్రం కొన్నేళ్లుగా కనిపించడం లేదు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీరంగు వజ్రం స్వామి వారి వజ్రాన్ని పోలి ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన రమణదీక్షితులు.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.


టీటీడీపైనా, తిరుమల ఆలయ పవిత్రత, స్వామి వారి ఆభరణాల అపహరణ విషయంలో రమణదీక్షితులు చేసిన ఆరోపణలను ఈవో అనికుమార్ సింఘాల్ ఖండించారు. తిరుమల శ్రీవారి కైంకర్యాల, ఆభరణాల విషయంలో ఎలాంటి అపోహలు లేవని ఈఓ తెలిపారు..  జస్టిస్ వాద్వకమిటి,జస్టిస్ జగన్నాధ్రావు కమిటి ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని రోపొర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన సింఘాల్ ..  రూబి డైమండ్ పై రమణదీక్షితులు చేసిన ఆరోపణలన్నీ ..  అవాస్తావాలని కొట్టిపారేశారు. రమణదీక్షితులు తన పదవి పోయిందనే అక్కసుతోనే..అసత్యాలు మాట్లాడుతున్నారని.. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆరోపించారు. 20యేళ్లుగా  తిరుమల కొండపై ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులు అప్పుడెందుకు మాట్లాడలేదని విమర్శించారు. ఆగమశాస్ర్తం ప్రకారమే.. శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని, ఆగమ సలహామండలి, అర్చకుల ఆమోదంతోనే  పోటు మరమ్మతులు చేస్తున్నామిన స్పష్టం చేశారు. బ్రహ్మణుల్లో విచ్ఛిణ్ణానికి కొన్ని రాజకీయపార్టీలు కుట్రచేస్తున్నాయని మండిపడ్డారు.


అటు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం బ్రాహ్మణ  సామజిక  వర్గంపై  చర్యలకు పునుకుంటుందని  బ్రాహ్మణ ఐక్య వేదికఆరోపించింది.టీటీడీలో జరుగుతున్నఅవినీతిపై ప్రశ్నించినందుకు రమణ దీక్షితులును తొలగించారని,రమణ దీక్షితులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొనడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి తన మొట్టమొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం చుట్టూ రాజకీయ వివాదాలు చుట్టుముడుతున్న వేళ రమణదీక్షితులు మరోసారి.. ఆభరణలు, గులాబీ రంగు వజ్రం అపరహరణకు గురైందన ఆరోపించడం. సీబీఐ ఎంక్వైరికి డిమాండ్ చేయడంతో ఈ వివాదం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి దాటి పొలిటికల్ ఇష్యూగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: