నాడు క్లీన్ స్వీప్.. నేడు సున్నా.. ఉమ్మడి కర్నూలులో ఫ్యాన్ రెక్కలు విరిగినట్టే!

Reddy P Rajasekhar
వైసీపీకి 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ సీట్లను అందించిన జిల్లాలలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకటి. జగన్ పై నమ్మకమో అభిమానమో తెలీదు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకి ఎప్పుడూ అండగా నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కు 14 స్థానాలలో క్లీన్ స్వీప్ చేయగా ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేదు. తుది ఫలితం సమయానికి రిజల్ట్ అటూఇటూ కావచ్చు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమికి కంచుకోటగా మారిందనే చెప్పాలి.
 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాన్ రెక్కలు విరిగినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఉమ్మడి కర్నూలుకు న్యాయ రాజధానిని ప్రకటించినా న్యాయ రాజధాని వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదని ఇక్కడి ప్రజలు భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనుందని తెలుస్తోంది.
 
జనసేన, బీజేపీ సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా టీడీపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను దాటనుంది. వైసీపీ 25 మంత్రులలో 24 మంత్రులు ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. పెద్దిరెడ్డి ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కచ్చితంగా గెలుస్తారని చెప్పలేని పరిస్థితి నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని తెలుస్తోంది.
 
ఉమ్మడి కర్నూలు ఫలితాలను చూసి కర్నూలు వైసీపీ నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కర్నూలులో 12 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కనీసం విజయం సాధిస్తుందని భావించగా ఫలితాలు అందుకు భిన్నంగా ఉండబోతున్నాయి. ఉమ్మడి కర్నూలులో టీడీపీ నేతలు కసితో పని చేస్తే వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా పని చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ, నంద్యాల ఎంపీ స్థానాల్లో సైతం కూటమి ఆధిక్యం కొనసాగుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: