రిషికొండపై పసుపు జల్లుతున్నారే! టీడీపీ విజయం ఖాయమైనట్లేనా?

Purushottham Vinay
విశాఖకు వైసీపీ భారీ ఆఫర్ ని ప్రకటించింది. విశాఖను అంతర్జాతీయ నగరంగా చేస్తామని కూడా ప్రామిస్ చేసింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని కూడా పేర్కొంది.విశాఖలోనే జూన్ 9న రెండోసారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని జగన్ పదే పదే ఎన్నికల సభలో చెప్పడం జరిగింది.కానీ ఏమైంది? తీరా చూస్తే కనుక విశాఖ జిల్లా మొత్తం కూడా టీడీపీకి జై కొట్టి వైసీపీని దూరం పెట్టేసింది. 2019 ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి మొత్తం 15 సీట్లకు గానూ 11 వస్తే ఈసారి మాత్రం కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే ఆధిక్యత కనిపిస్తోంది. అవి కేవలం పాడేరు, అరకు సీట్లుగా ఉన్నాయి.దీనిని బట్టి చూస్తే విశాఖ ప్రజానీకం అంతా మాకొద్దీ రాజధాని అని ముక్తకంఠంతో తీర్పు ఇచ్చేశారు అని ఇప్పుడు అర్ధం అవుతుంది. విశాఖను తాము విశ్వ నగరం చేస్తామని పాలనను ఇక్కడికే తీసుకుని వస్తామని జగన్ మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కానీ విశాఖ జనాలు ఏ మాత్రం నమ్మలేదు అనడానికే ఇది ఒక ఉదాహరణ అని తెలుస్తుంది.విశాఖ ప్రశాంత నగరం అని అది కేవలం అభివృద్ధి మాత్రమే జరగాలి తప్ప రాజధాని పేరుతో రాజకీయం తగవని విశాఖ ప్రజలు అంటున్నారు.


అందుకే విశాఖ గురించి వైసీపీ ఎంత లేపినా ప్రజలు మాత్రం జగన్ వద్దనే అంటూ వచ్చారు.మరో వైపు అమరావతి రాజధానిగా ఉండాలని వైసీపీ గతంలో ఒప్పుకుని ఆ తరువాత 2019లో మాట మార్చడం వల్ల అక్కడ జనాలు నమ్మకం కోల్పోయి వైసీపీని తీసి పక్కన పెట్టారు. అలా అటు రాజధాని కోరుకున్న అమరావతి వాసుల కోరికను పట్టించుకోకుండా ఇటు విశాఖ రాజధాని వద్దు అంటున్న కూడా ఇదే రాజధాని అని వైసీపీ చేసిన ఈ స్వారీకి గుక్క తిప్పుకోలేని జవాబుని అంటు అమరావతి వాసులతో పాటు ఇటు విశాఖ వాసులు కూడా ఇచ్చారు అని తెలుస్తుంది. ఇప్పటికే విశాఖ రిషి కొండపై టీడీపీ తమ్ముళ్లు పసుపు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.ప్రజల మనసెరిగి రాజకీయాలు ఎవరైనా చేయాలి కానీ తన సొంత అజెండాను జనం నెత్తి మీద రుద్దాలనుకుంటే మాత్రం అది తప్పు అవుతుందని ఇంకా దాని ఫలితం ఇలాగే ఉంటుందని కూడా తాజా ఫలితాలు నిరూపించాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నది కూడా పచ్చి నిజం అయింది అని ఇప్పుడు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: