జనం ‘మధ్య’ లేకపోతే.. ఓటమి ఎవరికైనా తథ్యమా?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎన్నికల పోరు ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఫలితాల రోజున హడావిడి చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటు అధికార పార్టీ వైసిపి ఇటు ప్రతిపక్ష పార్టీ టిడిపి, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే 144 సీట్లలో టిడిపి పోటీ చేయగా.. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం 132 స్థానాలలో ఆధిక్య పోరుతో ముందుకు సాగుతోంది.. అలాగే 21 స్థానాలలో జనసేన పోటీ చేయగా ఇప్పటికే 20 స్థానాలలో ఆధిక్యత చూపిస్తూ ముందుకు సాగుతోంది.. అలాగే 10 స్థానాలలో బిజెపి పోటీ చేయగా ఇప్పటికే 7 స్థానాలలో ముందంజలో ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా వెళ్లడయ్యింది..
ఇక 175 స్థానాలలో పోటీ చేసిన వైసిపి కేవలం 16 సీట్లతోనే ముందంజలో ఉండడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమౌతూ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలబడినప్పుడే ప్రజలు వారిని విశ్వసిస్తారు.. అలా చెయ్యకపోతే కచ్చితంగా ఓటమి చూడాల్సిందే.. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ అంటూ పథకాలను ప్రవేశపెట్టిన వైసిపి ప్రభుత్వం మరొకవైపు రెడ్ల సామాజిక వర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. తాను ప్రవేశపెట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని గుడ్డిగా నమ్మిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు..

ఏ నాయకుడైనా సరే గెలిచిన తర్వాత లేదా గెలవకముందే ప్రజలలోకి వెళ్లి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి .. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇలా  ఓటమి చూడాల్సిందే. సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగిందని చెప్పాలి.. జనం మధ్య లేకపోతే వారు మనల్ని గుర్తించడం కష్టం.. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు వేయాలని వెళ్తే మాత్రం వారు ఓటు వేయరు .. ఫలితంగా ఓటర్ల అభిప్రాయాన్ని ఎవరు మార్చలేరు.. అందుకే ఏ నాయకుడైనా సరే గెలిచిన తర్వాత గెలవకపోయినా సరే ప్రజలలోకి వెళ్లి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా గెలుస్తారనడంలో సందేహం లేదు. జనం మధ్య లేకపోతే ఎవరికైనా సరే ఓటమి తథ్యమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: