గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్!

Edari Rama Krishna
పాతగుంటూరులో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటికే గుంటూరు దాచేపల్లి లో మైనర్ బాలికపై ఓ వృద్దుడు అత్యాచారం చేయడం..ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.  ఈ సంఘటనపై ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై దుమ్మెత్తి పోశారు. ఏపీలో వరుసగా ఇటాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని..తాజాగా మైనర్ పై ఓ యువకుడి అత్యాచారం..ఇవన్నీ ప్రభుత్వం అసమర్ధతకు తీరుగా వ్యవహిరస్తున్నారని అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాతగుంటూరు దుర్ఘటనపై అధికారులతో భేటీ అయిన చంద్రబాబు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ధి వస్తుందని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి, వారిని ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

కాగా, రఘురామ్ అనే యువకుడు పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ దుర్మార్గుడిని తమకు అప్పగించాలని బాలిక బంధువులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో భవనం అద్దాలు ధ్వంసమై, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన ఐజీ, అర్బన్ ఎస్పీ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరిస్థితి చేజారకుండా గుంటూరులో 144 సెక్షన్‌ను అమలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: