ఊహించని సౌకర్యాలతో పవన్ బస్సు యాత్ర !

Seetha Sailaja
019 ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా రాజకీయపార్టీల నేతలు అందరు మరో రెండు మూడు నెలలో ఎన్నికలు ఉన్నాయి అన్న హడావిడితో ఎన్నికల ప్రచార వ్యూహాలు గురించి ఆలోచనలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. ఈపరిస్థితుల నేపధ్యంలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి తన ‘జనసేన’ ను మరింత విస్తరించేందుకు  సిద్దమవుతున్నాడు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర  పేరుతో గత 8నెలలుగా జనం మధ్య తిరుగుతున్న నేపధ్యంలో  ప్రజలు జగన్ పాద యాత్రకు విపరీతమైన సంఖ్యలో హాజరు అవుతున్న విషయం తెలిసిందే. 

దీనితో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీవర్గాలలో ఒక విధమైన అభద్రతా భావం ఏర్పడింది. దీనికితోడు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపోతున్న నేపధ్యంలో జనం అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడాని పవన్ కళ్యాణ్ కూడ రంగంలోకి దిగుతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 జిల్లాలలో దాదాపు 40 రోజులపాటు పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈపర్యటన కోసం పవన్ ఒక ఆటోమొబైల్ సంస్థ నేతృత్వంలో ఒక స్పెషల్ బస్సును సిద్ధం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

ఈ బస్ లో చిన్నపాటి లివింగ్ రూమ్ కార్యకర్తలు ఎవరైనా సులభంగా వచ్చి మాట్లాడడానికి చిన్నపాటి క్యాబిన్ అలానే బస్ పైకి వెళ్ళటానికి లోపలినుండి చిన్న నిచ్చెన లాంటి సౌకర్యాలతో పాటు మార్గమధ్యలో పవన్ రెస్ట్ తీసుకోవడానికి ఆధునాత సదుపాయలతో కూడిన ఒక  బెడ్ రూమ్ మరియు బాత్ రూమ్ కూడ ఈబస్సులో ఉన్నట్లు సమాచారం. అయితే పవన్ బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా త్వరలో ‘జనసేన’ వర్గాల నుండి ఈబస్సు యాత్ర పై ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండ గా పవన్ తన భార్య అన్నా మరియు పిల్లతో ఒక వారంరోజులు హాలీడే ట్రిప్ వేసి పవన్ నిన్నరాత్రి తిరిగి హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేటినుంచి పవన్ తిరిగి తన ‘జనసేన’ వ్యహారాల వైపు ముఖ్యంగా తన బస్సుయాత్ర ఎర్పాట్లు పై పవన్ తన సన్నిహితులతో లోతైన చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: