బస్సు యాత్ర అన్నాడు మళ్ళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు..పవన్ కళ్యాణ్ !

KSK
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుండి తాను ఏదైతే ప్రజలకు చెప్పేవాడో..ఇప్పటివరకు తాను చెప్పినది చేయించినట్లు..చేసినట్లు ఎక్కడ దాఖలు కాలేదు. గతంలో ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేస్తే  కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తానని అప్పటి ఎన్నికల ప్రచార సమయంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను రాజకీయాలలోకి వచ్చింది అధికారం కోసం కాదని ప్రశ్నించడం కోసమే అని అన్నారు. అయితే తాను మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడిన కాని గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ప్రశ్నించిన సందర్భాలు లేవు.


మొన్న తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవం నాడు ఏదో ఎన్నికలు వస్తున్న క్రమంలో చంద్రబాబుపై లోకేష్ పై ఏవో అవినీతి ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకున్నారు. మరి అదేవిధంగా ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యల విషయంలో కూడా...ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వారం రోజులలో మీ సమస్య తీరుస్తానని చెప్పడం జరిగింది..తీరా చూస్తే ఇప్పటివరకు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ చూపించలేదు పవన్ కళ్యాణ్.


ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల రాష్ట్రం మొత్తం బస్సుయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ పదవ వ తారీఖు లోపు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తాను ప్రకటించిన బస్సుయాత్ర ని చేయారంట.


దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి నిరుత్సాహ చెందారు. మరియు అదే విధంగా ఐదేళ్ల కాలంలో తాను కనీసం రాజకీయ పార్టీలో ఓ లేయర్ వ్యవస్థను కూడా నిర్మించుకోలేకపోయానని… గందరగోళంతో కార్యకర్తలను.. అభిమానుల అంచనాలను కూడా అందుకోలేకపోయానని పవన్ కల్యాణ్ కూడా బాధపడుతున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: