అధర్మమే శ్వాసగా బ్రతికే అధినేత ధర్మపోరాటం చేయగలరని నమ్మేదెలా?

పదే పదే తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ  అనుభవం గుఱించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గమనించ వలసిన విషయం గుర్తించవలసిన దాని అవసరము ఒకటి ఉంది. అదే మంటే చేయాల్సిన పని మామూలుగా చేసినా, నిబద్ధతగా వాగ్ధానాలు నెరవేర్చే పనిచేసినా ప్రజలే సుధీర్ఘ అనుభవం గుర్తిస్తారు. అలా కాకుండా ఆ వ్యక్తే తన అనుభవాన్ని పదేపదే చెప్పుకుంటున్నారంటే ఈ కాలానికి ఆయన పనిచేయటానికి పనికిరాడని తనను తాను గుర్తించినట్లే. 

కారణం ఇప్పుడు బజార్లో తొక్కుడు రిక్షా ఎంతగా వాడుకకు పనికి రాదో, కాలం మెచ్చని పనులు చెసేవారు కూదా అంతగా అనుభవం గుఱించి పదే పదే మాట్లాడుతూ తద్వారా గుర్తింపు పొందాలని అనుకుంటుంటారు. అలాంటి  రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా అబ్సొలేటే. ఆఖరికి ఆయన చంద్రబాబైనా ఆయన బాబైనా సరే!
“మీరు అనుభవఙ్జులు మీ అనుభవం మాకు అవసరం” అని ప్రజలు గుర్తిస్తే అది గొప్ప విషయం. అంతే కాదు “నేను దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుణ్ణ ని” చెప్పే చంద్రబాబు ఈ ఆధునిక పాలనకు “అబ్సొలేట్ రాజకీయ నాయకుడు” అని నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఇలాంట ప్పుడు తనకు తానే తప్పు కుంటే కనీస గౌరవం అయినా మిగులుతుంది వారికి.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తను ప్రజలకు చేసిన 600 వాగ్ధానాలతో ప్రజల  పట్ల బాధ్యత ఉందనేది సంశయాస్పదం. ఎందుకంటే, బాధ్యత ఉన్నవారు ఎడాపెడా 600 వాగ్ధానాలు చేయలేరు. నిర్మాణాత్మకంగా పని చేయాలనుకునే వారు అంత విచ్చలవిడిగా వాగ్ధానాలు చేయరు చేయలేరు చేయబోరు.

గత ఏడు దశాబ్ధాల ఆంధ్రప్రదెశ్ ఋణభారం తొంభైవేల కోట్లరూపాయిలు ఐతే దానికి అదనంగా ఈ నాలుగేళ్ళ పాలనలో ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయిలు జతయ్యాయి. కాని ఎలాంటి చెప్పుకోదగ్గ ఆస్థులుగాని సంపద గాని కనిపించటం లేదు. దాదాపుగా ఈ సొమ్ములో ఎక్కువ బాగం వృధా వ్యయంగా జాతి నెత్తిన అంత పెద్ద ఋణభారం పడింది. జాతి అభివృద్దికి ఇదొక గుదిబండ.

దాన్ని  ప్రజల నెత్తిన రుద్దింది ‘ధర్మపోరాటం’ అని మాట్లాడే చంద్రబాబు నాయుడే. 

*రాష్ట్ర విభజనకు తొలి లేఖ అందించింది
*విభజన సమయంలో ఐదుకాదు పదేళ్ళు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదా కోరింది
*ఆ తరవాత ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదన్నది
*ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమే ప్రత్యేక పాకేజీ అని అంగీకరించింది
*అరుణ్ జైట్లి మాటల ద్వారా ప్రత్యేక పాకేజిని అడిగింది కోరి అంగీకరించింది 
*పొలవరం జాతీయ ప్రోజెక్ట్ నిర్మాణ బాధ్యత తలకెత్తుకొంది
*అమరావతి నిర్మాణం పై దాదాపు ఇరవై దేశాలు మందీ మార్బలంతో తిదిగింది
*జపాన్ మాకీ అసోసియేట్స్ తో ప్రణాళిక సిద్ధం చేయించి అవమానం కొనుక్కొంది
*ఒక సినిమా దర్శకునికి  విశ్వనగరానికి నిర్మాణ ప్రణాలిక సిద్ధం చేయమని చెప్పింది
*పది సార్లకు పైగా విశ్వనగర నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేసింది 
*మాట్లాడితే సింగపూర్ కౌలాలంపూర్ ఇలా నోటికి వచ్చిన మహానగరం పెరు చెపుతూ నగర నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేయంది – ఎవరు?
ఇంకెవరు నారా చంద్రబాబు నాయుడే. 

-తమాషాలు, మాజిక్కులు, జిమ్మిక్కులూ చేస్తూ నాలుగేళ్ళ విలువైన సమయం కెంద్రంతో అంటకాగి భుగ్గిచేసిందెవరు?
-ఎన్నికల వేళ ప్రజాహృదయంలో వైసిపి నిలుపుతూ వస్తున్న “రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా” అంటూ మళ్ళా జనం నెత్తిన శఠగోపం పెట్టటానికి సిద్ధమైనది ఎవరు?
-అమరావతి అనబడే నేటి ప్రాంతం అసలు ఎవరికోసం ప్రజలకోసమా? కాదు? తన అనుచరగణం సంపద కూడబెట్టటానికి కాదా?
_అసలైన అమాయకులు, అన్నధాతల భూ సంపదను భూసేకరణ పేరుతో భయపెట్తి, హింసించి, శాడిజంతో సేకరించి అమరావతిని నిర్మిస్తే జన హృదయఘోషతో నిండిన అనగర నిర్మాణం ఎలా పూర్తవుతుంది? ఇది ధర్మ పోరాటమా? 
-అటు పవంతో కొంతసేపు సత్సాంగత్యం నెఱపినా ఈయన హృదయం ఆయన అర్ధంచేసుకొని బయట పడ్డారు ఎలాగోలాగా! 
-అసలు ఈ కాస్మోనగరం ఎవరికోసం? సామాన్యులు కోరని విశ్వనగరం మనుగడలోకి ఎలా వస్తుందనుకున్నారు. 
-“ఒకే కులాధిఖ్య ప్రాంతం” ఎలా కాస్మో నగరం అవుతుందనుకున్నారు బాబు!
-ప్రపంచంలో సామాన్యుడు నివసించలేని విశ్వనగరాన్ని చూపించగలరా బాబు మీరు?

అంతే కాదు నగర జన్మతోనే:
*కాల్మని వ్యాపారం
*స్త్రీల మాన ధన ప్రాణాలకు సంరక్షణ నివ్వలేని ఆవరణం
*కల్తీ, ఇసుక, భూ, రెడ్ శాండల్, నార్కోటిక్స్ మాఫియాలకు ఆలవాలమైన ఆవరణం
*మహిళా సాధికారత అంటూ ఒక మహిళా శాసనసభ్యురాలి ఉసురు కొట్టించుకొని శాపం పోందిన భూ పునాదిలో విశ్వనగరం అంకురిస్తుందా ఉద్భవించగలదా?
*పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలం రాష్ట్ర రాజధానిగా పుక్కటిగా వాడుకోదగిన ‘భాగ్యనగరం’ వదిలేసిన రాత్రికి రాత్రి పారిపోయి వచ్చి చేరిన రాజకీయ నాయకుని పాపం ఊరికే పోతుందా?  ణగరానికి అది శాపం కాదా?
*ఓటుకు నోటు కుంభకోణంలో ప్రజల ముందు టెలిజన్ల ద్వారా నిండా ఇరుక్కున్న ఈ రాజకీయ కథానాయకుడు ధర్మపోరాటానికి అర్హుడా?
*అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించబడ్డ ఆ మహాశక్తి ఇంద్ర కీలాద్రి అధినేత్రి శాపం పెట్టలేదా? 
*రహదార్ల విస్తరణ పేరుతో వందలాది చిన చిన్న దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సమక్షంలో కూల్చివేసిన పాపం శాపం గుఱించి ఆలోచించవలసిందే. 

ఇన్ని పాపాలు చేస్తూ ఇప్పుడు రూటు మార్చి ప్రత్యేక హోదా అంటూ కేంద్రాన్ని తిట్టుకుంటూ ఆదే దొంగ నాటకాలు కొంగ జపాలు ఫోర్ట్వంటీ వేషాలు ఇవన్నీ నాయకుని రాజకీయ ప్రస్థానానికి సమాధి కట్టటం ఖాయం అంటున్నారు అమరావతి వాసులు. 

ఎంపి జెసి దివాకర రెడ్డి అన్నట్లు నరెంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు – అనే వ్యాఖ్యను కొద్దిగా మార్చి "చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా రాదు"  ఇది ఆ మహానగర దేవత, అలాగే అమరావతి కారణంగా ఉనికి కోల్పోయిన అన్నార్తుల, అన్నదాతల శాపఫలం. 

ఉదాహరణకు ఏడుకొండలవాడి నుండి మూడు కొండలు కొట్టేసి అదేదో కట్టలనుకున్న ఆ దివంగత నేతకు పట్టినశాపం – ఈ నేత తనకు పట్టకుండా చూసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: