చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న జగన్!

KSK

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న నేపథ్యంలో జగన్ కేంద్రంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడతామని గతంలో ప్రకటించారు. అయితే అనూహ్యంగా జగన్ అవిశ్వాస తీర్మానాన్ని ఈ శుక్రవారం ప్రవేశపెట్టబోతున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబు శిబిరంలో కలకలం రేపింది. ముఖ్యంగా చంద్రబాబుకి జగన్ తీసుకున్న నిర్ణయంతో చెమటలు పట్టాయి అని చెప్పవచ్చు.


ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రులు, పార్టీ కీలక నేతలతో సుదీర్ఘమంతనాలు జరిపిన చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మనమెందుకు మద్దతు ఇవ్వాలని కొందరు మంత్రులు సీఎంను ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశానికైనా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉండాలని, మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


వైసీపీ అవిశ్వాసం నిజాయతీతో కూడినదైతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, స్వలాభం కోసం అయితే అది ఆ పార్టీ విజ్ఞతకే వదిలేద్దామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టబోయే అవిశ్వాస తీర్మానం పట్ల దేశ రాజకీయాలలో చర్చ జరుగుతుంది.


ఒకవేళ అవిశ్వాసం వీగిపోయిన కానీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో దేశం మొత్తం తెలుస్తుంది అని అంటున్నారు వైసిపి నాయకులు. ఈ నేపథ్యంలో వైసీపీకి దేశంలో కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాలలో అలాగే రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తుంది.  మొత్తం మీద ప్రత్యేక హోదా విషయంలో జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: