కోదండరామ్ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

siri Madhukar
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఈ రోజు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మిలియన్ మార్చ్ పై కండీషన్లు పెడుతూ వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కొందరు ట్యాంక్ బండ్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టులు చేశారు. 


తార్నాకలో ప్రొ.కోదండరామ్ తో పాటు పలువురు టీజేఏసీ కార్యకర్తలు అరెస్టు అయ్యారు.  దీంతో అక్కడ పోలీసులు, కోదండరామ్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోదండరామ్ ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ట్యాంక్ బండ్ కు బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 


ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఆయనను తరలించారు.  పోలీసులను ఉపయోగించి కెసిఆర్‌ సభను అణచివేయాలని భావిస్తే, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. 


శాంతియుతంగా సభ నిర్వాహించాలని తాము భావించామని..కావాలనే టిఆర్‌ఎస్‌ సర్కారు ఉద్రికత్తలను పెంచుతోందని కోదండరామ్‌ ఆరోపించారు. అరెస్టుల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: