ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్ ..!

siri Madhukar
గత కొన్ని రోజుల నుంచి గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలుసు.  గుజరాత్ లో మొదటి నుంచి బిజెపి తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది..అయితే కాంగ్రెస్ ఉపాద్యక్షులు రాహుల్ గాంధీ ఈసారి గుజరాత్ లో కాంగ్రెస్ జెండా పాతాలని ధృఢ నిశ్చయంతో ఉన్నారు.  ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రచారానికి రావడంతో బిజెపి శ్రణులకు నూతనోత్సాహం కలిగింది.  మోదీ ప్రచారం తనదైన స్టైల్లో కొనసాగిస్తూ..గతంలో కాంగ్రెస్ చేసిన అవకతవకలను ప్రజలకు తెలియజేస్తున్నారు. 

మరోవైపు రాహూల్ గాంధీ పెద్ద నోట్ల వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వస్తూ...దాని వల్ల భారత దేశంలో ఎంతో నష్టం వాటిల్లిందని..చిన్న వ్యాపారస్తులు నిండా మునిగారని ప్రచారం చేస్తున్నారు.  అయితే గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ అయ్యింది. కాగా, గుజరాత్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరూ ప్రచారం చివరి రోజయిన మంగళవారం అహ్మదాబాద్‌లో రోడ్డు షో నిర్వహించాలని భావించారు. అయితే ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ అనుమతి కోరినా.. అహ్మదాబాద్ పోలీసులు నో చెప్పారు.

అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు పోలీసులు.ఈ నెల 14న గుజరాత్‌లో మిగిలిపోయిన 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న సౌరాష్ట్రతోపాటు దక్షిణ గుజరాత్‌లలోని 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశ ఎన్నికల కోసం ప్రధాని మోదీ సోమవారం మూడు ర్యాలీల్లో, రాహుల్ గాంధీ నాలుగు ర్యాలీల్లో పాల్గొననున్నారు. మరోవైపు పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఇవాళ అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించనుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: