ఇండో -పసిపిక్ ప్రాంతంలో భారత్ మాత్రమే పెద్దన్న: అమెరికా

భారత సంస్కృతి సాంప్రదాయం చెప్పే సత్యం ఒకటే. ప్రపంచ శాంతిని ఆశించటమే. ఆ దిశలో పయనించటమే. నేడు మన సాంస్కృతిక వారసత్వాన్ని అగ్రరాజ్యం అమెరికా కూడా గుర్తించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ఆసియా పర్యటకు రాబోతున్న సందర్భంలో శ్వేతసౌధం భారత్‌ గురించి ఒక ఆసక్తిర వ్యాఖ్య చేసింది. "ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లో భారత్‌ పెద్దన్న పాత్ర"  పోషించాలని, శ్వేతసౌధం అభిప్రాయపడింది. ఆసియా దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, వియాత్నాం, ఫిలిప్పీన్స్‌ లో అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ 12 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు రావడం లేదన్న విషయం తెలిసిందే.



అగ్ర రాజ్య అద్యక్షుడు ట్రంప్‌ ఆసియా పర్యటనకు సంబంధించి వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్‌ సెక్రెటరీ సారా హకాబీ శాండర్స్‌ ట్రంప్ పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ సమయంలోనే ఆమె "ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లో భారత్‌ పెద్దన్న"  పోషించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌ లో అమెరికా కు భారత్‌ అత్యంత విశ్వసనీయ, వ్యూహాత్మక మరియు కీలక భాగస్వామి అని సారా హకాబీ శాండర్స్‌ తెలిపారు.


కొంతకాలంగా భారత్‌ తో అమెరికా వ్యూహాత్మక, రక్షణ, ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థితరం చేసుకుంటోందని సారా శాండర్స్‌ తెలిపారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ తో పాటు, మొత్తం ప్రపంచానికి శాంతిని అందించగల సామర్ధ్యం భారత్‌ కు మాత్రమే ఉందని ఆమె అన్నారు.




ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ భారత్ మాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం మాకు సంభందించి మాకు కొన్ని ఏకీకృత సాధారణ ఆలోచనలున్నాయి. భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే మేము కూడా. అందుకే భారత్ మాకు అపారమైన ప్రియతమ దేశం. 
 

ఈ పర్యటనలో భారత్‌కు తమ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెళ్లడం లేదని, అయితే అమెరికాకు భారత్‌ ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌ తో ఉన్న బలమైన సంబంధం దృష్ట్యా, హడావిడి షెడ్యూల్‌ తో భారత్ కు వెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ఇష్టపడడం లేదని ఆమె స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: