60 ఏళ్ల వయసులో అందాల పోటీలో గెలిచిన బామ్మ?

Purushottham Vinay
అందాల పోటీ అంటే అందరికీ కూడా ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ వయసులో వారు చాలా చాలా ఫ్రెష్ గా అందంగా చురుకుగా కనిపిస్తారు. అయితే ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనా కు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌  సరికొత్త చరిత్ర సృష్టించి ప్రపంచమంతా షాక్ గురయ్యేలా చేసింది.ఎందుకంటే ఆమె వయస్సు 60 సంవత్సరాలు. ఆ వయసులో మిస్ యూనివర్స్ అయ్యే అందాన్ని మైంటెన్ చెయ్యడం మామూలు విషయం కాదు. కానీ తన అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ 'భామ'.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు.అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో రీసెంట్ గా అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా 'మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌' టైటిల్‌ ని గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఇంత లేటు వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.


ఇక వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా.. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు ఈమె.ఇక ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే 'మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా' పోటీల్లో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే 'విశ్వసుందరి 2024' పోటీల్లో తన దేశం తరఫున ఈమె పాల్గొంటారు. ఈ అందాల రాణి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ 'మిస్‌ యూనివర్స్‌' ఆర్గనైజేషన్‌ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అందాల పోటీలో కేవలం 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. ఈ సంవత్సరం నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్‌ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్‌ ఆ దేశ అందాల కిరీటంని గెల్చుకున్నారు. ఈ సంవత్సరం విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: