ఆ తేదీన బుల్లితెరపై "బూట్ కట్ బాలరాజు"..!

Pulgam Srinivas
ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహెల్ ప్రధాన పాత్రలో బుట్ కట్ బాలరాజు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మేఘ లేఖ , సునీల్ , ఇంద్రజ , సిరి హనుమంత్ , జబర్దస్త్‌ రోహిణి తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ... కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.  

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ లో హీరోగా నటించిన సోహెల్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పడం , ప్రచారాలను జోరుగా చేయడంతో ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయ్యని అయిన అందుకుంటుంది అని జనాలు అనుకున్నారు. ఇకపోతే మామూలు అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 2 , 2024 న థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని మే 5 , 2024 న సాయంత్రం 5:00 గంటలకి ఈటీవీ తెలుగు లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: