డిస్కో శాంతి మేనకోడలు ఆచూకీ లభ్యం..!

Edari Rama Krishna
హీరో శ్రీహరి సతీమణి డిస్కో శాంతి మేనకోడలు చెన్నైలో అదృశ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే.  చైన్నైలోని టీనగర్‌లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్‌ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె అబ్రిన్‌ నగరంలోని చర్చ్ పార్క్ స్కూల్‌లో ప్లస్ టూ చదువుతోంది.  ఈ నేపథ్యంలో అపర్ణ తల్లి సెరిల్, మేనత్త లలిత కుమారి (ప్రకాశ్ రాజ్ మొదటి భార్య) మీడియా ముందుకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు.  

టి నగర్ లో ఉంటున్న అబ్రిన్ సెప్టెంబర్ 6న బయటకు వెళ్ళింది...అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ అమ్మాయి కోసం బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు.దీంతో కుటుంబ సభ్యులు స్థానిక టీ.నగర్, పాండిబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదుచేశారు. పోలీసులు  అబ్రిన్‌ చదువుతున్న చర్చ్‌ పార్క్ స్కూల్‌లో విచారించారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్‌ను పరిశీలించారు.  కానీ ఎక్కడ కూడా అబ్రిన్ ఫోటో ఫుటేజ్ లభించలేదు.  

తాజాగా ఆమె ఆచూకీ తాజాగా   తెలుసుకున్నామని ఈ విషయాన్ని కోలీవుడ్ నటుడు కార్తీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత రాత్రి ఆమె ఆచూకీ కనుగొన్నామని చెప్పాడు.  సెప్టెంబర్ 6న పాఠశాలకు వెళ్లిన అబ్రిన్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలోని టీనగర్ పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  

వారికి సాయం చేసేందుకు నడిగర్ సంఘం ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు అబ్రిన్ మిస్ అయిన విషయాన్ని, ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి  అబ్రిన్ ఆచూకీ కనుగొన్నామని చెప్పాడు. ఆమెను గాలించడానికి సహకరించిన బెంగళూరులోని వాలంటీర్లకు, తమిళనాడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.


Abrina was found last night. I sincerely thank all of you who helped to find her, especially volunteers in Bangalore & our Tamilnadu police. pic.twitter.com/rwuDRbALKY

— Actor Karthi (@Karthi_Offl) September 16, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: