జపాన్ ని సముద్రంలో ముంచేస్తాం..!

Edari Rama Krishna
గత కొన్ని రోజుల నుంచి మూడవ ప్రపంచ యుద్దం రానుందా అన్న అనుమానాలకు తావిస్తున్నట్లుంది.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్‌ వ్యవహారం.   ఇప్పటి వరకు అమెరికాపై యుద్దం చేస్తామని..అమెరికా అంతు చూస్తామని అంటున్న కిమ్ ఇప్పుడు జపాన్ పై విరుచుకు పడ్డారు.  అణు పరీక్షలు, క్షిపణుల దాడులతో ప్రపంచదేశాలను ఉత్తరకొరియా భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఉత్తరకొరియా ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడ ఖాతరు చేయడం లేదు.  తాజాగా  ఇప్పుడు జపాన్ ఇక ఎంతోకాలం మాకు దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు.

ఆ దేశానికి చెందిన నాలుగు ద్వీపాలను అణుబాంబులు వేసి సముద్రంలో ముంచేస్తాం.  అమెరికాతో కలిసి జపాన్ కుట్ర చేస్తోందని ఉత్తరకొరియా జపాన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఎంతో కాలం తమకు సమీపంగా జపాన్ ఉండదని ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది.ఇలా చేస్తే కానీ, జపాన్ తమ దరి చేరలేదంటూ బెదిరించింది ఉత్తరకొరియా. తమను బెదిరించే దేశాల అంతు చూస్తామని ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది.  ఇటీవల ఉత్తరకొరియా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా అణు పరీక్షపై తీవ్రంగా మండిపడ్డ అమెరికా.. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని ఐరాస భద్రతమండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 15 మంది సభ్యులు గల భద్రతమండలి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్తరకొరియా చమురు దిగుమతులపై కోత పెట్టడంతో పాటు ఆ దేశ జౌళి ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఐరాస నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ దేశాలు కిమ్ జాంగ్ వ్యవహారంపై విమర్శలు లేవనెత్తుతున్నారు..కానీ కిమ్ మాత్రం అణ్వాయుధాలను ఉపయోగించి జపాన్‌ను ముంచేస్తామని, అమెరికాను బూడిద చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: