ఆదర్శ రైతు కేసీఆర్..!!

Vasishta

          తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం లాంటి అనేక పథకాలు తెలంగాణ అమ్ములపొదిలో అస్త్రాలుగా మారాయి. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్.. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారు. ఆందుకే ఆయన్ను ఆదర్శ రైతు అవార్డు వరిచింది.


          కేసీఆర్ ఆదర్శ రైతు కావడమేంటి.. అనే సందేహం రావడం సహజం. ఇలా చెప్పగానే అందరూ.. అవున్లే.. కేసీఆర్ ఫాంహౌస్ లో బాగా పండిస్తున్నారు కదా.. అందుకే అవార్డు వచ్చింటుందిలే అనుకుంటారు. ఎందుకంటే.. ఫాంహౌస్ లో రకరకాల పంటలను కేసీఆర్ సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు.


          అయితే కేసీఆర్ కు వచ్చిన అవార్డు అది కాదండీ.. ఆయనకు వ్యవసాయ నాయకత్వ అవార్డు లభించింది. 2017 సంవత్సరానికి గానూ కేసీఆర్ కు ఆ అవార్డు ఇచ్చి సత్కరించింది ఇండియన్ కౌన్సిలే ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకే ఈ అవార్డు ఇస్తున్నట్టు ఐసీఎఫ్ఏ ప్రకటించింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ కేసీఆర్ ను అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డుకు నామినేట్ చేసింది.


          వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో విస్తృత సేవలందించేవారికి ప్రతి ఏటా ఈ అవార్డును భారత వ్యవహాస ఆహార మండలి అందిస్తూ వస్తోంది. వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు, పథకాల అమలు చేస్తున్నందుకుగానూ ఈ అవార్డును 2008 నుంచి ఇస్తోంది. వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేసీఆర్ కు ఇవార్డు అందజేయనున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: