ట్రంప్ దురహంకార ధోరణి అమెరికాను పతనం చేస్తుందేమో?



అమెరికా అధ్యక్షులవారు ప్రపంచములో తాము తమదేశం మాత్రమే ఉండాలనుకుంటుందా? ప్రపంచ దేశాలు ఈయనకు ఈయన దేశానికి ఊడిగం చేయాలా? అసలేమిటీ ఈ మానసిక స్థితి. విదేశాల వారు తమదేశంలో ఉద్యోగం చేయొద్దు. తమ కడుపు నిండాకే వేరేవారికి అవకాశం. విదేశీయుల వీసా లపై విద్వెష పూరిత ఆంక్షలు. అసలు అమెరికా అభివృద్ది అంతా అనెక మంది నైపుణ్యమున్న సుశిక్షుతులు వలసల ద్వారా వలస దేశంగా పుట్టిన అమెరికా అభివృద్ది చేశారు. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద యంత్రాలు యంత్రభాగాలు తయారీలో నిష్ణాతురాలైన జెర్మనీని ఆక్షేపించటమే. అన్నీ దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవటం ఆయనకు అలవాటైంది. 


ఇప్పుడు "వివాదాలకు కేంద్రబిందువుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపాంతరం చెందాడని జర్మనీ అంటోంది" ఆయన దృష్టిలో అమెరికా మాత్రమే గొప్పదేశంగా కనిపిస్తోందని మిగతా ప్రపంచదేశాలని ఆయన గుర్తించే స్థితిలో కూడా లేడని వారంటున్నారు. జర్మనీ మీడియా ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. 


మొన్న శుక్రవారం జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో "యూరోపియన్ యూనియన్ కమిషన్" అధ్యక్షుడు "జీన్‌క్లాండ్ జూంకర్" కూడా అక్కడే ఉన్నారు. ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే "జర్మనీ అమెరికాలో ఎక్కువ కార్లు అమ్ముతోంది" అని ఇది మంచి పద్దతి కాదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.


మిత్రదేశంగా ఉన్న జర్మనీ తమ ఆర్థిక వనరులను కొల్లగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు ఆ సమయంలో అక్కడున్న జర్మనీ మీడియా అభ్యంతరం చెప్పలేదు. అయితే మరుసటి రోజు మాత్రం రకరకాల కథనాలు ప్రచురించింది. జీన్‌క్లాండ్  జుంకర్ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారని జర్మనీ మీడియా వెల్లడించింది. అమెరికా కంపెనీలు ప్రపంచ దేశాల్లో అనేకచోట్ల వ్యాపారాలు చేసుకుంటుంటే కేవలం జర్మనీ కంపెనీలపై అక్కసు వెళ్ళగ్రక్కటం ఎంతవరకు సబబని వారంటున్నారు.

ఈ పోటీ ప్రపంచం లో ఎవరైతే క్వాలిటి ప్రోడక్ట్స్ సరాపరా చేయగలదో వారే మార్కెట్లను శాసిస్తారు. అమెరికా ప్రోడక్ట్ క్వాలిటీ తక్కువ గాబట్టి కార్ల రంగాన్ని జెర్మని ప్రొడుక్ట్స్ తమ క్వాలిటి తో అమెరికా మార్కెట్ ను దున్నేయటం సహజమే. ఈ మాత్రం కూడా జ్ఞానం లేని ట్రంప్ అమెరికాని ఏ గంగలో కలుపుతాడో? కాలమే నిర్ణయించాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: