ట్రంప్ దెబ్బకు ఇస్లామిక్ దేశాల గుండెల్లో పరుగెత్తుతున్న రైళ్ళు



రాజు తలచు కుంటే దెబ్బలకు కొదవా?  అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ కు విశ్వం విలవిల్లాడుతుంది. డాలర్ డ్రీంస్  'పేకమెడల్లా కుప్ప కూలు తున్నాయి'  ఆశలు అడియాసలు అవుతున్నాయి.  గుండెల్లో దడ భయం వెల్లువౌతుంది. అటు పాకిస్థాన్ ఇటు సౌదీ అరేబియాకు ఇప్పటికే భవిష్యత్ లీలగా  కళ్ళలో వెండితెరపై సినిమాలా కనిపిస్తుంది.


ఉగ్రవాదులను అదుపుచేసే క్రమంలో ఎన్నికల్లో తాను వాగ్దానం చేతూ ఇచ్చిన మాటకు కట్టుపడే నేతగా అన్నంత పనీ చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ఇస్లామిక్ దేశాల్లో గుడేల్లో రైళ్ళు పరుగెత్తిస్తూ దడ పుట్టించడం ఇంకా కొనసాగుతునే ఉంది. ఆ ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం జడుసుకుని సోమవారం రాత్రి ముంబై దాడుల వ్యూహకర్త  "హఫీజ్ సయీద్‌" ను ఆకస్మికంగా గృహనిర్బంధంలోకి తీసుకుంది. ఐఖ్యరాజ్య సమితి సలహాని కూడా ప్రక్కనబెట్టి చైనా మద్దతు మాటున హఫీజ్ సయీద్ ను అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్న పాక్ దాదాపుగా చడ్డీ తడిపేసుకుంటుంది. మరి చైనా మద్దతేమైందో మరిప్పుడు? 



ఇప్పుడు సౌదీ అరేబియా వంతు. అమెరికా తమపై ఎలాంటి నిషేధం విధించకున్నా భద్రత దృష్ట్యా, అమెరికాలో ఉన్న తన పౌరులకు సౌదీ ముందస్తు అత్యవసర భద్రత కు చెందిన ఆదేశాలు జారీ చేసింది. సౌదీ పౌరులారా అమెరికాలో మీరు ఇవి చేయొద్దు-అవి చేయొద్దు (డుస్ అండ్ డోంట్స్ ఇన్ యు.ఎస్.ఏ). ఇలా నుద్దిగా ఉండాలి, అలా మర్యాదగా మెలగాలి అంటూ కొన్ని నీతి సూక్తులు కొన్ని సుద్దులను సౌదీ ప్రభుత్వం తన పౌరుల కోసం అందించింది, అత్యవసరాదేశాలు జారీ చేసింది. అగ్రరాజ్యం లోని విద్యను అభ్యసించే సౌదీ విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు తప్పనిసరిగా కొన్ని నియమాలను భాద్యాతా యురంగా పాటించాలంటూ ఘట్టి హెచ్చరికే చేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి పనులు చేయాలో, వేటికి దూరంగా ఉండాలో వివరాలతో అందించింది. 
 
రానున్న కాలంలో రాబోయే విపత్కర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంబసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. అమెరికాలోని సౌదీ పౌరులయినా, అగ్రరాజ్యం వెళ్లే వాళ్లయినా ఈ సూచనలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రాబోవన్నారు.



 
అమెరికాలో మీరేం చేయవచ్చునో? ఏం చేయకూడదో? సౌదీ పౌరులకిచ్చిన ఆదేశాల చిట్టా:
 
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో అసాంఘిక కార్య కలాపాలకు సంబధించిన ఫోటోలు, వీడియోలను తొలగించండి. 
ఎయిర్‌పోర్టుల్లోనూ, అమెరికాలోనూ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. 
రాజకీయ, మత పరమైన సిద్ధాంతాలను భావనలను బయటపడ నీయకపోవడం మంచిది. 
తీవ్రవాదం, ఉగ్రవాదంతో పాటు తమాలకు సంబంధించిన ఫేస్‌బుక్, సోషల్ మీడియా గ్రూప్స్‌ నుంచి బయటకు వచ్చేయండి. 
అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు ఒత్తిడికి లోనవకుండా కూల్‌గా ఉండండి. 
అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడకండి. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టకండి. అమెరికా నియమ నిబంధనలను తప్పనిసరిగా, విధిగా పాటించండి. 


 


ఎక్కడకు వెళ్లినా సంబంధిత పత్రాలను తోడుగా ఉంచుకోండి. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతోన్మాదం తో పాటు అమెరికాలు వ్యతిరేకంగా తీసిన సినిమాలను డౌన్‌లోడ్ చేసినా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చిన్న చిన్న తప్పులకు విధించిన జరిమానాలు వెంటనే కట్టేయండి. కోర్టులో హాజరయ్యే పరిస్థితి కొని తెచ్చుకోవద్దు.  ముఖ్యంగా అమెరికా వ్యతిరేక వైఖరి ఉన్న సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవద్దని కూడా సౌదీ ప్రభుత్వం తన పౌరులను పదే పదే హెచ్చరించిందంటే ట్రంప్ పెట్టిన సెగ సౌదీని ఎంత వేడెక్కించిందో తేటతెల్లమౌతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: