కూటమి అధికారంలోకి వచ్చినా చినబాబుకు మంత్రి పదవి రాదు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు గెలుపు అంశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఏపీలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విజయాల పై అందరి దృష్టి ఉంది. అయితే ఈసారి నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కచ్చితంగా గెలుస్తారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే... అందులోనూ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా కీలక పదవిలో ఉంటారు.
మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో... గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్... ఈసారి 30 వేల నుంచి 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తారని సమాచారం అందుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రిగా ఉన్నా కూడా... ఆర్కే చేతిలో ఓడిపోయారు నారా లోకేష్. ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ను ఓడించేందుకు మహిళ అభ్యర్థిని పెట్టింది వైసిపి. అయినప్పటికీ అధికార వైసిపి పార్టీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత, నారా లోకేష్ పై ఉన్న నమ్మకం, మార్పు రావాలని ఏపీ ప్రజలు ఉన్న నేపథ్యంలో... ఈసారి కచ్చితంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు వెల్లడించాయి. ఈ లెక్కన నారా లోకేష్ మంగళగిరిలో ఈసారి కచ్చితంగా గెలుస్తారని తెలుస్తోంది. అయితే నారా లోకేష్ గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా వెళ్లడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం చాలా ఉన్న అందులో బీజేపీ ఒకటని సమాచారం. కూటమిలో బిజెపి పార్టీ ఉంది. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకం.

ఇలాంటి సమయంలో నారా లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు వెనకాడుతారని అంటున్నారు. లోకేష్ కు పదవి ఇస్తే ప్రభుత్వం పై విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని చంద్రబాబు అనుకుంటున్నారట. లేదా కెసిఆర్ తరహాలో... చేయాలని నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు. రెండోసారి గెలిచిన తర్వాత కేటీఆర్ అలాగే హరీష్ రావుకు మొదటగా మంత్రి పదవులు ఇవ్వలేదు కేసీఆర్. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత వారిద్దరికీ పదవులు ఇచ్చుకున్నారు. చంద్రబాబు కూడా... ఏపీలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నారా లోకేష్ కు పదవి ఇస్తారని తెలుస్తోంది. లేదా మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందట. మొత్తానికి ఈసారి చిన్న బాబుకు మంత్రి పదవి లేనట్లే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: