విశాఖ సౌత్: వైసీపీపై జనసేన గెలుపు 100% పక్కా?

Purushottham Vinay
•విశాఖ సౌత్ లో జనసేన ఎర్ర కండువా ఎగరడం పక్కా
•వంశీకృష్ణయాదవ్‌ భారీ గెలుపుతో ఎమ్మెల్యే అవ్వడం ఖాయం

విశాఖ సౌత్ - ఇండియా హెరాల్డ్: 3 లక్షల ఓటర్లు ఉన్న విశాఖ దక్షిణలో మొదట కాంగ్రెస్, ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ గెలిచింది. రీసెంట్ గా ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరఫున పోటీ చేయగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్‌ పోటీ చేశారు.వీరు ఇద్దరు కూడా సొంత పార్టీలను వీడి కొత్త పార్టీల్లో చేరి ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలవడం విశేషం. ఇక గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌…. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఇక వైసీపీ నగర అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ ఎమ్మెల్యే అవ్వాలనే తన జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు జనసేన పార్టీలో చేరి విశాఖ దక్షిణ సీటు దక్కించుకున్నారు.

వీరి ఇద్దరిలో ఈ ఎన్నికలలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ కి ఓట్లు ఎక్కువ పోల్ అయినట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. వైసీపీకి విశాఖలో ఉన్న వ్యతిరేకత జనసేనకి బాగా కలిసి వచ్చింది. అందువల్ల వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. వంశీకృష్ణ  ఒకసారి పీఆర్‌పీ నుంచి మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈ సారి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించి, ఆయనకే టికెట్‌ ఇవ్వడంతో వైసీపీని వదిలేశారు వంశీకృష్ణ యాదవ్‌.

అంతేకాకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఇస్తామని ఆశచూపి కార్పొరేటర్‌గా పోటీ చేయించి వైసీపీ, ఆ హామీ నెరవేర్చకపోవడం వంశీకృష్ణ హర్ట్ అయ్యి ఈ ఏడాది ఆరంభంలో జనసేనలో చేరారు. ఆ తరువాత విశాఖ దక్షిణ నుంచి టికెట్‌ దక్కించుకోవడం చకచకా జరిగిపోయింది. అయితే వంశీకృష్ణ కన్నా ముందు జనసేనలో చేరిన కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజు వంటివారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా కానీ జనసేనాని పవన్‌ నచ్చజెప్పడంతో వారంతా సైలెంట్‌ అయిపోయారు. కూటమి ఓట్ల బలంతో ఈ సారి ఎన్నికల్లో ఓట్లు బాగా పడ్డట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: