మెగా ఇలాకాలో ' జ‌న‌సేన నాయ‌క‌ర్ ' సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ...?

RAMAKRISHNA S.S.
- మెగా ఫ్యామిలీ పుట్టినిల్లు న‌ర‌సాపురంలో ఈ సారి జ‌న‌సేన బంప‌ర్ విక్ట‌రీ
- 2019లోనే రెండో స్థానంలో నిలిచిన బీసీ నేత నాయ‌క‌ర్‌
- కాపు + బీసీ ఈక్వేష‌న్‌తో భారీ మెజార్టీపై జ‌న‌సేన గురి..!
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
మెగా ఫ్యామిలీ సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం. నరసాపురం ప్రజలు మెగా ఫ్యామిలీని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అయితే రాజకీయంగా మాత్రం ఎందుకో ? ఈ ప్రాంతంలో మెగా ఫ్యామిలీకి పట్టుచిక్క‌టం లేదు. మెగా బ్రదర్స్ ముగ్గురు ఇక్కడ నుంచి ప్రజారాజ్యం, జనసేన పార్టీల తరఫున పోటీ చేసినా విజయాలు సాధించలేకపోయారు. 2009 మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నరసాపురం పక్కనే ఉన్న తన అత్తగారి ఊరు పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే నరసాపురం లోను ప్రజారాజ్యం విజయం సాధించలేదు. అయితే ఈ రెండు స్థానాలలోనూ రెండో స్థానంలో ప్రజారాజ్యం నిలబడటం విశేషం.

ఇక 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా పవన్ సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పక్కనే ఉన్న భీమవరం నుంచి పోటీ చేసిన జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచి ఓడిపోయారు. అలా మెగా ఫ్యామిలీ ఇళ్లుగా పిలుచుకునే నరసాపురం ఏరియాలో భీమవరం. పాలకొల్లుతో పాటు నరసాపురం పార్లమెంటు స్థానాల నుంచి ముగ్గురు మెగా బ్రదర్స్ పోటీ చేసిన విజయ సోపానాలు ఎక్కలేకపోయారు. అలాంటి చోట తాజా ఎన్నికలలో జనసేన సంచలన విజయం సాధించబోతోంది.

మెగా ఫ్యామిలీ పుట్టిల్లు అయిన నరసాపురం నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసిన బీసీ నేత బొమ్మిడి నాయకర్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలోనే నాయకర్ గణనీయమైన ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ముదునూరు ప్రసాద‌ రాజు చేతిలో కేవలం 5000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశం ఇక్కడ జనసేన దెబ్బకు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు తెలుగుదేశం + జనసేన కాంబినేషన్ కావటం... నాయకర్‌ బీసీ కావడంతో పాటు కాపు సామాజిక వర్గం మొత్తం ఆయన వైపే ఉండడంతో ఇక్కడ జనసేన భారీ మెజార్టీతో విజయం సాధించ‌నుంది.

ఏది ఏమైనా గతంలో చిరంజీవి ప్రజారాజ్యం... ఆ తర్వాత పవన్ జనసేన ద్వారా సొంత నియోజకవర్గంలో విజయం సాధించని మెగా బ్రదర్స్ కు ఇప్పుడు నరసాపురంలో జనసేన గెలుపు అదిరిపోయే కిక్ ఇవ్వనుందని చెప్పాలి. అలాగే భారీ మెజార్టీతో ఇక్కడ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ విజయం సాధించి సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని రాసి పెట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: