జనసేన విక్టరీ: పాలకొండ కింగ్ ఎవరు..జయకృష్ణకు జయమేనా.?

Pandrala Sravanthi
• పాలకొండను పాలించేదెవరు..?
• కళావతి కన్నీటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?
• జనసేన నుంచి జయకృష్ణ పట్టు బిగిస్తాడా..?


 ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పాలకొండ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే గత రెండు పర్యాయాలు  వైసీపీ అభ్యర్థి అయిన విశ్వసరాయి కళావతి పాగా వేశారు. అలాంటి ఈమె మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ట్రై చేస్తోంది. మరి కళావతి హ్యాట్రిక్ కొడుతుందా  లేదంటే జనసేన అభ్యర్థి  జయ కృష్ణ ముందు బోల్తా పడుతుందా అనే వివరాలు చూద్దాం.. పార్వతీపురం మాన్యం జిల్లాలోని  ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో  పాలకొండ కూడా ఒకటి. ప్రస్తుతం ఇక్కడి రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో నిమ్మక గోపాలరావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి నిమ్మక గోపాలరావు కొడుకు నిమ్మక జయ కృష్ణకు టిడిపి తరఫున టికెట్ వస్తుందని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఇది జనసేన పార్టీకి వెళ్లిపోవడంతో దీంతో జయకృష్ణ జనసేన లో జాయిన్ అయిపోయి అక్కడ టికెట్ తెచ్చుకున్నారు. ఎంతో పట్టున్నటువంటి జయకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న విశ్వసరాయి కళావతి ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా తనదే విజయం అనుకున్న తరుణంలో జయకృష్ణ రూపంలో పోటీ తీవ్రమైంది.


 నియోజకవర్గ స్వరూపం:
 పాలకొండ నియోజకవర్గం లో మొత్తం పాలకొండ, బామిని,వీరఘట్టం, సీతంపేట వంటి  నాలుగు మండలాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 1,94,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 94,900 మంది ఉండగా, స్త్రీలు 99,300 మంది ఉన్నారు. ఇక సామాజిక వర్గాల విషయానికి వస్తే  బగత సామాజిక వర్గాల వారు 32 శాతం ఉంటారు.  బోయ వాల్మీకి 22%, కొప్పుల వెలమ 11%, కొండదొర 16%, కోండు 5%, ఇతరులు 14% ఉన్నారు. 2014లో వైఎస్ఆర్సిపి నుంచి విశ్వసరాయి కళావతి పోటీ చేశారు. ఈమెకు 55337 ఓట్లు పడ్డాయి. టిడిపి నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణ కు 53,717 ఓట్లు పడ్డాయి. కళావతి 1620 తో మెజారిటీ సాధించారు. ఇక 2019 విషయానికి వస్తే కళావతికి 72,054 ఓట్లు పడ్డాయి. ఇక జయకృష్ణకు 54,074 ఓట్లు పడ్డాయి. ఈసారి 17900 మెజారిటీతో కళావతి మరోసారి గెలుపొందింది. ఇక ఈ ఎన్నికల్లో  కళావతి వైసిపి నుంచి మూడోసారి బరిలో ఉండగా, జయకృష్ణ మాత్రం జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నారు.

 
 బలబలాలు:
 ఇప్పటికీ రెండు సార్లు గెలిచినటువంటి విశ్వాస రాయి కళావతి మీద  విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇసుక దందాలు,భూ కబ్జాలు  ఇలా ఎన్నో అక్రమాలు చేసి నియోజకవర్గ అభివృద్ధి మరిచారనే అపోహ కూడా ఉంది.  2014లో కన్నీరు పెట్టుకుంటూ ఓట్లు వేయాలని అర్పించిన ఈమె  అప్పుడు టిడిపి ప్రభుత్వం రావడంతో అభివృద్ధి చేయలేకపోయానని నన్ను ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. 2019లో మరోసారి గెలిచి  వైసిపి అధికారంలో ఉన్నా కానీ  నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ముఖ్యంగా ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడికి  ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు,  మార్కెట్లు  తీసుకురావడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈసారి విశ్వసరాయి కళావతికి అక్కడ ఎదురుదెబ్బ తగిలే  అవకాశం కనిపిస్తోంది. ఇక నిమ్మక జయకృష్ణ విషయానికొస్తే ఇప్పటికే ఆయన రెండుసార్లు ఓడిపోయారు. అయినా పట్టు బిగించిన విక్రమార్కుడిలా  ఆ నియోజకవర్గాన్ని విడిచి వెళ్లలేదు. గత పది సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ క్యాడర్ కు  ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకున్నాడు.  ఎప్పటికప్పుడు కళావతి చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. దీనికి తోడు రెండుసార్లు ఓడిపోయిన సింపతి, ఈసారి టిడిపి, బిజెపి, జనసేన  ఉమ్మడిగా పోటీ చేయడం ప్రధానంగా కలిసివచ్చే అంశం. కాబట్టి నిమ్మక జయకృష్ణ కు ఈసారి విజయమే అని అక్కడి ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: