పవన్ కళ్యాణ్ కు జల్లికట్టులో జెల్లకొట్టిన నెటిజెన్స్!




బ్రిటీష్ వలస వాదుల పాలనా కాలంలో ఒక హత్య కేసులో ముద్ధాయిని బ్రిటీష్ న్యాయస్థానం నేరస్థుడుగా తీర్మానించి ఉరిశిక్ష ఖరారు చేసి ఆ వ్యక్తిని అండమాన్ జైలుకు పంపించింది. ఆ జైలు లో ఆ నేరస్థుడు ఉరిశిక్ష కోసం తను చేయని తప్పుకైనా తప్పక ఉరిశిక్షకోసం ఎదురుచూస్తున్నాడు నిర్వికారంగా.



అయితే వేరే కేసులో ఇదే ముద్దాయి అదే సమయములో నేరస్థుడుగా నిరూపించబడటంతో నేరస్థుడు ఒకే సమయములో రెండుచోట్ల ఉండటం అసంభవం కాబట్టి ఉరిశిక్ష పడ్డ కేసుతో "బెనిఫిట్ ఆఫ్ డౌట్" ప్రయోజనం ప్రసాదిస్తూ బ్రిటిష్ న్యాయస్థానం ఆయనకు ఉరి రద్ధు చేసింది సరిగ్గా ఉరేసే సమాయానికి.



అయితే ట్రంక్ ద్వారా ఉరి రద్ధు సమాచారాన్ని ఆంగ్లంలో పంపారు. అదేమంటే "హాంగ్ హిం నాట్, లీవ్  హిం" (అతన్ని ఉరివేయవద్దు, వదిలేయండి) అని రావాల్సిన తంతి (టెలిగ్రాం) గుమస్తా పొరపాటు తో కామా పెట్ట వలసిన చోటు మారి "హంగ్ హిం, నాట్ లీవ్ హిం" (అతన్ని ఉరేయండి. వదిలేయొద్ధు) అని వచ్చింది.


పాపం న్యాయస్థానం అతన్ని వదిలేయమన్నా"క్లెరికల్ ఎర్రర్" / గుమస్తా "పొరపాటు" ఆయన్ని ఉరేయించింది. ఇదంతా ఎందుకంటే విరామ చిహ్నం (పంక్చుయేషన్ మార్క్ - కామా) ఒక చోట పెట్టాల్చింది మరో చోట పడి పాపం ఒకడు ఉరెయ్యబడ్డాడు.  


“జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం”  అంటూ తమిళులు సాధించిన విజయాన్ని అభినందిస్తూ!  "జనసేన" అధినేత, ప్రఖ్యాత తెలుగు నటుడు, పవర్ స్టార్,  పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే పార్టీ పరంగా ప్రెస్ కు కూడా ఒక లేఖను పంపించారు. తమిళులు చూపించిన పోరాట పటిమ తెలుగు వారు కూడా "ప్రత్యేక హోదా" సాధించడం లో చూపించాలన్నది ఈ లేఖలోని అసలు సారాంశం. 



అయితే ఇందులో ఓ పెద్ద తప్పు దొర్లినా! దాన్ని గమనించకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "సంతకం" చేయడం నెటిజన్ల విమర్శలకు కారణమైంది. సదరు లేఖలోని మొదటి పేరాగ్రాఫ్ లో, "కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుకు "వ్యతిరేకం" గా నినదించడం స్ఫూర్తిదాయకం" అన్న పొరపాటును గమనించకుండా పవన్ కళ్యాణ్ సంతకం చేసి ప్రెస్ కు విడుదల చేసారు. అలాగే తన "ట్విట్టర్ ఖాతా" లో పోస్ట్ చేసిన ఫోటోలో కూడా అలాంటి పొరపాటే ఉంది.

జల్లికట్టు కోసం అంటే జల్లికట్టుకు "అనుకూలం" గా పోరాడిన ఘనత తమిళులది కాగా, జల్లికట్టుకు వ్యతిరేకం గా అని లేఖలో ఉన్న పొరపాటును గమనించకుండా పవన్ కళ్యాణ్ సంతకం చేయడంతో, సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఒక పదానికి బదులు ఆవేశ పడి తొందరలో ఇంకోపదం వాడితే ఇలాంటి అనర్ధాలే జరిగుతాయ్. కొంపలంటుకుంటాయ్.

రాజకీయనాయకులు కొంపలు కూల్చుతారు అన్నట్లే, పవన్ రాజకీయ నాయకుడుగా మారుతున్నాడనటానికి ఇది సంకేతమా? అంటు న్నారు ఆయన అభిమానులే. 


ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి, అంత బాధ్యతారాహిత్యంగా ఎలా సంతకం పెడతారు? అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ చిన్న పొరపాటే పవన్ కళ్యాణ్ లోని చిత్తశుద్ధిని చాటిచెప్తోందని, రాజకీయ నాయకులను విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పై ఉన్న శ్రద్ధ లేదా ఫోకస్, అసలు సబ్జెక్ట్ పై ఉండడం లేదని మండి పడుతున్నారు. సినిమాలలో బిజీగా ఉంటే, సినిమాలే చేసుకో వాలి తప్ప ఇలా ప్రజా జీవితంలో అర్ధాలు మారిపోయేలా చేయకూడదు అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం. అయితే "ఒక్క పదం" తో అర్ధం అనర్ధమైతే కథ సమాప్తం ఔతుందని మనవి. ఒక్క పదం మారి పదార్ధం మొత్తం మారిందని అర్ధం చేసుకోండి పవన్ అంటున్నరంతా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: