అమరావతి మూడు చేపల కథ


ఒక దట్టమైన అడవి. అందులో అందమైన కొలను. కొలను నిండా నీళ్ళు. ఆ నీళ్ళలో మూడు చక్కని చేపలు పైగా మిత్రులు. ఒక చేప బుద్దిమతి. మరొకటి కళామతి ఇంకొకటి మందమతి. కొలను నిండా నీరున్నంత వరకు కేరింతలతో ఉత్సాహంగా ఉన్న ఈ మూడుచేపలు వెసవిలో కొలనులో నీరు తగ్గటం తో ఒక్కసారిగా డీలా పడిపోయాయి. అంతేకాదు ఒకరోజు ఇద్దరు మత్యకారులు "ఈ కొలను లో నీరు ఇంకి పోయింది కాబట్టి రెండురోజుల్లో వచ్చి చేపలను వలేసి పట్టేద్ధాం" అని మాట్లాడు కోవటం విన్నాయి. భయంతో సమావేశం పెట్టిన బుద్దిమతి, ఒక దూరదర్శి - చాలా దూరం అలోచించగల నేర్పరి. అందుకే మనం ఇప్పుడే ఈ కొలను వదలి నిండుగా నీరున్న ప్రక్కనున్న కొలను కెళ్ళిపోదాం అని చెపుతూ తానైతే వెళ్ళి పోయింది ప్రశాంతంగా.  


రెండవ చేపైన కళామతి మాత్రం ఆ సమయాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి ఆలోచించుకోగలనను కొని ఊరకుంది. అది ఒక ప్రాప్త కాలజ్ఞత కలిగిన తెలివైనది.  మూడవ చేప మందమతి. అంటే మందభాగ్యుడు అలోచించటం చేతకాని జీవి. అలాగే రెండు రోజుల సమయముందని ఊరకుండిపోయింది సోమరిలా. అనుకున్న రోజు రానే వచ్చింది వలేసిన మత్యకారుల వలలో మన రెండు చేపలు కళామతి, మందమతి చిక్కుకున్నాయి. వెంటనే కళామతి లో కొత్త అలోచన పుట్టి సమయస్పూర్తి, ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించి వలలో చచ్చినట్లుగా అలా పడిపోయింది. మత్యకారుడు చచ్చిన కళామతి చేపను మళ్ళా కొలను లోకే విసిరేశాడు. బ్రతుకు జీవుడా అనుకొంటూ మరో నిండుగా నీరున్న కుంటలోకి చేరుకుంది. స్వార్ధం తప్ప ఆలోచన, తెలివిలేని, సమయానికి సరిగా స్పందించని, సోమరైన మందమతి అదే మందభాగ్యుడు మత్యకాతులకు చేపల పులుసులో చేపయ్యాడు.  


ఈ కథలోని చేపల లాగే నేడు ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు నాయకులున్నారు. అందరూ 67 సంవత్సరాల పైబడ్ద మేధావులే. వారే కొణిజేటి రోశయ్య గారు బుద్దిమతిగా, కే వి పి రామచంద్రరావు గారు కళామతిగా, ముత్తవరపు వెంకయ్యనాయుడు గారు మందమతి పాత్రలో సరిగ్గా ఒదిగిపోతారు.

 

మొదటి చేప:  రాజకీయ జీవితాన్ని ఎక్కువ భాగం ప్రశాంతం గా, ఒక ప్రణాలిక ప్రకారం గడిపారు కొణిజెటి రోశయ్యగారు. ఒకణ్ణి "ఫాలో" అయిపోతే పోలా?  నాకెందుకు దురద, అంటితే ముందున్న నాయకుడికే అంటుతుంది. నాయకుడిని 100% అనుసరించ గల నమ్మకస్తుడు.   ఏ ప్రశ్నకైనా సభలో,  బయటా కూడా సమర్ధవంతమైన ఎదురులేని  జవాబివ్వగల నేర్పున్న సహచరుడు కావాలెప్పుడు ఏ నాయకునికైనా! అది రోశయ్యగారిలో కావలసినంత ఉంది. నాయకుడు మారినా “కరక్టు ఫాలోయర్”   ఐన రోశయ్య పదవికి ఎప్పుడూ భరోసా ఉంటుంది. అందుకే తెలుగు రాజ కీయా ల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా “ఆర్ధిక మంత్రి” మాత్రం రోశయ్యగారే. నిజాయతీ, నాయకుణ్ణి మనసెరిగి మసులుకోగల తెలివి తేటలు, సమయ పాలన, సందర్బోచిత సంభాషణం, ఎవరికి మాటల్లో, చేతల్లో చిక్కని దొరకని వ్యూహాత్మకత, దురాశ లేకపోవటం, నొప్పించక తానొవ్వక తత్వం లాంటి వారి వ్యక్తిత్వమే వారి నైజం కావటం ఆయన్ను బుద్దిమతి, దీర్గదర్శి గా తీర్చిదిద్దాయి. అదే విధంగా వయసుడిగి నా  పదవి వద్దన్నా సందర్భం వస్తే మన రోశయ్య ఉన్నారుగా?  అని మోడీ  కూడా అలోచించ గల “అణకువ”  ఆయనది. ఆయనదంతా మొదటి చేప  తత్వం.

 

రెండవ చేప: ఒక బానర్  పట్టుకొని సభా సమయమంతా రాజ్యసభ లో వయసును లెక్క చేయకుండా నిలబడ్డారు. ముసలాయన అంత చేసినా కాంగ్రేస్  అధినేత్రి విభజనను ఆపలేదు అనే ఖ్యాతిని కొంగున కట్టు కున్నారు. ఆయనే కె.వి.పి. రామచంద్రరావు గారు. అంతర్గతంగా విభజన నేపద్యమంతా నడిపింది కె.వి.పి.రామచంద్రరావు గారే నడిపారంటారు. కాని "విభజన పాపం అంటకుండా వేషాలు" మాత్రమే ఇవి.  కె.వి.పి రామచంద్రరావు గారు మంచి ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించారు. ఒక బానర్ పట్టుకొని సభాసమయమంతా నిలబడ్డారు ముసలాయన అంత చేసినా కాంగ్రేస్ అధినేత్రి విభజనను ఆపలేదు అనే ఖ్యాతిని కొంగున కట్టు కున్నాడు. ఆయన సర్వీస్ మొత్తం సొంత వ్యాపారాలే పరమార్ధంగా డిల్లీలో తనపనులు చక్కపెట్టుకొనేవారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఆయన వల్ల ఇసుమంత ప్రయోజమైనా లభించలేదు. ఒక్క బానరే ప్రజలకు "అయ్యో పాపం పెద్దాయన" అనే సింపతీ ప్రజా హృదయాల్లో రిజిస్టర్ చేసుకున్నారు. అదీ రెండవ చేప లక్షణం లో కెవిపి ఇమిడిపోతారు, కళామతి తెలివితేటలు ప్రాప్తకాలజ్ఞత ఆయన స్వంతం.

 

మూడవ చేప: రాష్ట్ర విభజన సమయము లో ముత్తవరపు వెంకయ్యనాయుడు గారు  అనబడే  వెంకయ్య పట్టుపట్టి నాటి మౌన మునీంద్రుడు మన్మోహణుణ్ణి వత్తిడిచేసి మరీ ప్రత్యేక హోదా సాధించారు. అదీ ఐదేళ్ళు మాత్రమేనన్న మన్మొహన్-సింగ్ తో వాదించి మరీ పదేళ్ళకు హోదా వచ్చే ప్రకటన చేయించారు. నాడు అది ప్రశంశలు వెల్లువెత్తిన సంధర్బం. నేడు అది నిర్వీర్యం. నేడు దానికి ప్రజల నుండి విమర్శలవెల్లువ ప్రవహించింది. కాని దానికి చంద్రబాబు సన్మాన కార్యక్రమాలు రచించారు. ఒక విఫల ప్రయోజనానికి సన్మానాలు నేడు అంగీకరిస్తే భవిష్యత్ పరిణామాలు వెంకయ్య గారికి మందనతి అనే మూడవ చేపకు పట్టిన దుర్గతి పట్టకతప్పదు.    


ఇది మహాభారతములో "శకుని తరహా తంత్రం" కాని కృష్ణ మాయకాదు. కృష్ణ మాయైతే బహుళార్ధ ప్రజా ప్రయోజనమౌతుంది. కృష్ణ మాయ కాక పోవటానికి మరో ఆధారం  దాన్ని ప్రత్యేక హోదా  సాధించినంత ఘట్టిగా,  రాజ్యాంగ బద్ధం గా చట్టం చేయించక పోవటం. అంటే విభజన బిల్లులో చేర్చకపోవటం.  చేర్చమని వత్తిడి చేసిఉంటే - మునేయైనా “చట్టం పై మాంచి పట్టు, చట్ట జ్ఞానమున్న ఆయన అక్కడే కాదనే వాడు. అందుకే "గాలికి కొట్టుకు పోయే పేలపిండి కృష్ణార్పణం"  వస్తే ఖ్యాతి రాకపోతే "పోతేపోనీ" అనేవిధంగా మన్మోహన్ వ్యవహరించారు. “అశ్వత్థమ అతః నరుడు కాదు కుంజరః” లాంటి మర్మం, ధర్మం లాగా మేం చెప్పాం, చావవలసిన వారు చచ్చారు అదీ కాంగ్రెస్ కుతంత్రానికి వెంకయ్యగారు అవతారిక రచించారు.

 

ఈ తంత్రం మోడీ ముందే పసిగట్టి, ఆ పాపం లో భాగస్వామిని అదే చంద్రబాబుని, రాజకీయాంధకార కూపములోకి తొసేసె పనిని దీనికి ముందే రచించి ఉండవచ్చు. మన వెంకయ్య కథలు మోడీ ఎందుకు భరిస్తున్నాడంటే రేపు "ప్రత్యేక హోదా రాదనీ తెలిసుండీ మీ వెంకయ్యే పాపం పని చేయించినాడు. మాకేమో తెలియదాయె.  అందుకే వాగ్ధానాలు ఇచ్చాము.  అంతా  తెలిసిన తరవాతే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాము  ప్రత్యేక  పాకెజీ ఇవ్వదలచాం అదీ ప్రత్యేక హోదాకు సమానముగా. అయినా మీ చంద్రబాబేమో ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదన్నాడు. సుజానా చౌదరి ఎప్పుడూ ప్రత్యేక  పాకెజీ కావాలంటూ మావెంట పడ్డాడు. ఇంకె ముంది కేంద్రం లో ఉన్న రాష్ట్ర శ్రేయోభిలాషి మా బిజెపి మంత్రి వెంకయ్య,  టిడిపి మంత్రి సుజానా, వీళ్ళకు మించి ముఖ్యమంత్రి బాబే- స్వయంగా కోరిన (ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితిలో)  ప్రత్యేక పాకేజీ హోదాకి మించి ఇచ్చాం అంటారు" మీరు పదే పదే కోరింది మేమిచ్చాము.

 

మేము సీమాంద్రకు ద్రోహం చేయలెదు అని అంతా వెంకయ్యగారి మీదకు, చంద్రబాబు మీదకు, సుజనా మీదకు ఆ పాపఫంకిలాన్ని తోసేసె అవకాశం ఉంది. అంతేకాదు ప్రత్యేక పాకేజీ ఐతేనే ముద్ధని పదే పదే టెలివిజన్ ల ముందు పత్రికల్లో ఎక్కడపడితే అక్కడ ప్రవచించిన ఈ సుజాన, వెంకయ్య, చంద్రబాబు నీతి రీతి తెలుగు ప్రజలకు బాగా తెలుసు కదా! అదే మోడీ ప్రదర్శించబోయే అసలు చాణక్యం. దాని ముందు వీళ్ళ రాక్షస తంత్రం వీగిపోకతప్పదు.  అప్పుడు మూడు చేపల కథలో మూడో చేపైన మందమతిని పోలి ముగుస్తుంది వెంకయ్య గారి కథ. ఆయన మూడవ చేపలా మందమతి కాకపోయినా మత్యకారుల వలే “తోక ఝాడిస్తే దాన్ని కోసెయ్యగల మోడీ” ముందు ఈయన ని మందభాగ్యునిగా చెప్పవచ్చు.

 

“నమో అపర  చాణక్యుడు”  అనే విషయం  బహుశా మనకు తెలియక పోయినా  - పాకిస్తాన్,  కాశ్మీర్లో వెలుపెడితే  నమో  బలూచిస్తాన్ లో కాలు పెట్టాడు.  సెక్యూరిటి  కౌన్సిల్ లో  వీటో పవరు న్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ అవుట్రేట్ గా పాక్ ను ఈసడించుకునే వ్యూహాన్ని రచించాడు. మన  ఆగర్బ శత్రువు చైనా మర్యాద  కోస మైనా తప్పదన్నట్లు  యూరీ  సెక్టర్లో పాక్ దుర్మార్గాన్ని ఖండించేలా చేయటం  జవహర్లాల్ నెహౄ నుండి మన్మోహన్  సింగ్  వరకు ఎవరూ చేయలేని  సాహసకార్యం. ఇందిరాగాంధి లాంటి భద్రకాళికి మినహాయింపు. ఏమంటే ఆమె ఏకంగా యుద్దమే చేసింది, బంగ్లాదేశ్ ఏర్పాటు ఇందిర పాక్ పైసాధించిన ఘన విజయం .

నమో  యుద్ధాన్ని మించిన కోటాను కోట్ల రూపాయల విలువైన ఆయుధ సంపత్తి సాధించలేని సాహసకార్యం సాధించాడు. ఇప్పుడుఅన్నీ దేశాల సహకారం భారత్ కు ఉంది. అందుకే విదేశ ప్రయాణాలు చేసాడని అదీ వ్యూహాత్మకమేనని అర్ధమౌతుంది. రక్షణఅవసరాలకు, యుద్ధాలకు ముందు రాజనీతిజ్ఞులు చేసే పని ఇది. మన దేశంలో పనికి మాలిన వాళ్ళంటా ఈ ప్రధాని విదేశీప్రయాణాలపై ఇష్టంవచ్చిన మాటలు మాట్లాడారు. తెలంగాణా చతుష్టయం కూడా దీనికి మినహాయిపు కాదు.   ఐతే మనకిక్కడ మోడీ గురించి కాదు - మోడీ ఎలా తోలుతీసి ఉతికి తిత్తిని ఆరెయ్యగలడో చెప్పటానికి ఒక విశ్లేషణ మాత్రమే.

 

ఇక శకుని మాయ అనటానికి కారణం, రాజ్యసభలో ఈయన వాదనా పఠిమ విశ్వవిఖ్యాతమైంది. నరేంద్ర మోడీ ఇలాంటివాడొకడు "తిమ్మిని బమ్మి" చేయ టానికి దక్షిణాపథం నుండి కావాలను కొన్నాడు. ఆ పాత్రకు వెంకయ్య సరిగ్గా సరిపోయాడు. అందుకే  ఈ గుణాలు పుష్కలంగా ఉన్న  “ఆధునికాంధ్ర శకుని”  గా చెప్పవచ్చు. తద్వారా నరెంద్రమోడీ వద్ద శాశ్విత పదవి- తెలుగువాళ్ళకి వారి ప్రతినిధి కాకపోయినా మేలు చేశాడన్న కీర్తి- దేశములో అపర రాజనీతిజ్ఞుడన్న ప్రఖ్యాతి లభిస్తాయని ఆశించి చేసిన దుష్కార్యం.

 

రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించి డిల్లీలో మోడీని- సీమాంద్రలో బట్రాజులా పొగిడి అమరావతిలో చంద్రబాబుని, హైదరాబాద్ లో పెద్దగా హడావిడి చేయక వ్యతిరెఖత ప్రదర్శించకుండా కెసిఆర్ ని బుట్టలో పడేసి తనపనులు చక్కదిద్దుకునే చాతుర్యం వెంకయ్యనాయుడిగారిది. ఇలాంటోళ్ళని మోడీ నమ్మడు గాక నమ్మడు. వ్యూహం కోసం నమ్మాలి.  నమ్మాడు అంతే.  కెసిఆర్ తనకు నష్టం లేనంతవరకు ఓకె అంటాడు. ఇక చంద్రబాబుకు వెంకయ్య కీడు చెయ్యడు అక్కడ కులపిచ్చి, కులభక్తి, వ్యాపార లావాదేవీలు, అవసరాలు అగచాట్లు చాలా ఉన్నాయంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: